ఇంటిప్స్

12 Apr, 2016 23:11 IST|Sakshi
ఇంటిప్స్

బాదం పప్పుల మీదున్న పొట్టు సులువుగా రావాలంటే వేడినీళ్లలో 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. మజ్జిగలో నీళ్లు ఎక్కువైతే కొద్దిగా శనగపిండి కలపాలి.  రాగి పాత్రల మీద కొద్దిగా నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్ది కడిగితే కొత్తవాటిలా మెరుస్తాయి. డబ్బా అడుగున బ్లాటింగ్ పేపర్‌ను ఉంచి, బిస్కెట్లు ఉంచితే మెత్తబడవు.  కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.

     
చపాతీలు మెత్తగా ఉండాలంటే గోరువెచ్చటి నీటితో పిండి కలపాలి. చిటికెడు ఉప్పు, అర టీ స్పూన్ పంచదార వేసి కలిపి, చేస్తే చపాతీలు మెత్తగా, రుచిగా ఉంటాయి. బంగాళదుంపల చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కరివేప ఆకులు వేసి ఉంచాలి.   ఎండుమిరపకాయల్లో ఉప్పు, కొద్దిగా వంట నూనె కలిపి ఉంచితే ఎక్కువ రోజులు ఎర్రగా ఉంటాయి.

 

 

మరిన్ని వార్తలు