పదార్థాల ప్రత్యేకత కోల్పోకుండా...

1 Jun, 2016 22:44 IST|Sakshi
పదార్థాల ప్రత్యేకత కోల్పోకుండా...

ఇంటిప్స్

 

 పదార్థాలను శుభ్రపరచడం, వేరు చేయడం, వండటం, నిల్వ చేయడం.. ఈ నాలుగు విధానాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారాన్ని శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించాలి.


{ఫిజ్‌లో లేదా షెల్ఫ్‌లలో పదార్థాలను ఒకే పాకెట్‌లో 3-4 రకాలవి వేసి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాలకున్న ప్రత్యేక వాసన, పోషకాలు కోల్పోతాయి.  పదార్థాలను కట్‌చేసేటప్పుడు, వేరు చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. కటింగ్ బోర్డులు, గిన్నెలు ఉపయోగించడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. నీచు వాసన రాకుండా ఉండటానికి ఘాటువాసనలు లేని బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు.

 

మరిన్ని వార్తలు