ఇంటిప్స్

27 Jul, 2016 23:13 IST|Sakshi
ఇంటిప్స్

బట్టలపై బురద మరకలు పడితే వాటిని బంగాళాదుంపలు ఉడకబెట్టిన నీళ్లలో నానబెట్టి ఉతకాలి. బట్టల మీద హెన్నా మరకలు అయిన చోట ఆ భాగాన్ని పాలలో నానబెట్టి చల్లని నీటితో ఉతకాలి.  ప్లాస్క్ వాడనప్పుడు దానిలో పావు చెంచా పంచదార వేసి ఉంచితే తర్వాత ఉపయోగించేటప్పుడు దుర్వాసన రాదు.   కర్పూరం డబ్బా అడుగు భాగాన కొన్ని బియ్యపు గింజలు వేస్తే కర్పూరం కరిగిపోదు.  

ఉప్పు ఉంచిన డబ్బాలో అడుగున కొన్ని బియ్యపు గింజలు వేస్తే ఉప్పు ఉండలు కట్టకుండా ఉంటుంది. విరిగిపోయిన, మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలను ఎండలో పెట్టి, పొడి చేసి నిల్వ చేసుకుంటే గ్రేవీలు, కూరల తయారీలో వాడుకోవచ్చు.  మిక్సీలో పిండి గ్రైండ్ చేసేటప్పుడు ఫ్రిజ్ నీళ్లు పోస్తే పిండి బాగా పొంగుతుంది. అన్నం ముద్దవకుండా ఉండాలంటే బియ్యానికి నీళ్లు చేర్చే ముందు దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండాలి.
 
 

మరిన్ని వార్తలు