ఇంటిప్స్

31 Aug, 2016 23:56 IST|Sakshi
ఇంటిప్స్

రిఫ్రిజిరేటర్‌లో దుర్వాసన రాకుండా ఉండాలంటే తాజా బ్రెడ్ స్లైస్‌ని ఫ్రిజ్‌లో ఉంచాలి. చెడువాసనను బ్రెడ్ పీల్చుకుని ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచుతుంది. బాదం పప్పులను ఒక నిమిషం వేడినీటిలో నాననిస్తే, పొట్టు త్వరగా వచ్చేస్తుంది.అల్లం, వెల్లుల్లి పేస్టులో అల్లం నలభై శాతం, వెల్లుల్లి అరవై శాతం వేసుకుంటే కూరలు రుచిగా ఉంటాయి. వండటం పూర్తయ్యాక కూరలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వెంటనే ఒక బంగాళ దుంపని ఉడికించి, చిదిమి గ్రేవీలో వేస్తే ఉప్పును పీల్చేస్తుంది.

పలచగా ఉన్నా కూడా ఉడికించిన బంగాళదుంపను చిదిమి అందులో వేయాలి.   ఏదైనా పదార్థాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్‌కి ఒక టేబుల్ స్పూన్ వెనిగర్‌ను కలిపితే నూనెను ఎక్కువగా పీల్చుకోవు. మెత్తగా, దూదిపింజెల్లాంటి ఇడ్లీలు కావాలంటే పిండిని ప్లేట్లలో వేసేటప్పుడు కలపకుండా ముందురోజే బాగా కలిపి ఉంచుకోవాలి. కూరగాయలను తొక్కతోపాటుగా ఉడికిస్తే అందులోని పోషకాలు పోకుండా ఉంటాయి. అప్పడాలను పాలిథిన్ కవర్‌లో పెట్టి పప్పులు, బియ్యంతోపాటు పెడితే విరిగిపోకుండా ఉంటాయి.

 

>
మరిన్ని వార్తలు