ఇంటిప్స్‌

5 Jan, 2017 23:11 IST|Sakshi
ఇంటిప్స్‌

తీపిని ఇష్టపడని పిల్లలు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొంతమంది పిల్లలకు చక్కెరతో చేసిన స్వీట్‌ తింటే వెంటనే జలుబు, దగ్గు సమస్యలు వస్తుంటాయి. అలాంటప్పుడు తేనె వాడడం మంచిది. చక్కెర చక్కటి ప్రత్యామ్నాయం తేనె. ఇది సహజమైనది కాబట్టి ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్‌లూ ఉండవు. త్వరగా శక్తినిస్తుంది కూడ.
   
తేనె కొద్ది నెలలకు చిక్కబడుతుంది. అప్పుడు సీసాను పది నిమిషాల సేపు ఎండలో ఉంచితే తిరిగి పలచబడుతుంది. చిక్కబడకపోయినా సరే కనీసం ఏడాదిలో ఒకసారి అయినా అరగంట సేపు ఎండలో ఉంచాలి. బాటిల్‌ అడుగున ఉండిపోయిన తేనెను బయటకు తీయాలన్నా కూడా ఇదే పద్ధతి. తేనెను ఎప్పుడు కూడా మంట మీద వేడి చేయకూడదు.
 

మరిన్ని వార్తలు