ఇంటిప్స్‌

30 Apr, 2017 22:50 IST|Sakshi
ఇంటిప్స్‌

చక్కెర డబ్బాకు, ఇతర స్వీట్‌లను ఎంత జాగ్రత్తగా, ఎత్తులో పెట్టినా... చీమలు కొత్త దారులు వెతుక్కుంటాయి. కిటికీలు, గోడల మీద నుంచి బాటలు వేసేస్తాయి. చీమల దారిలో దాల్చిన చెక్క లేదా లవంగం పెడితే ఇక ఆ దారిన చీమలు ప్రయాణించవు. ఇక అవి మరొక దారిని వెతుక్కునే దాకా హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగే చక్కెర, స్వీట్‌ డబ్బాలో లవంగాలు లేదా దాల్చిన చెక్క పెడితే చీమలు దరిదాపులకు కూడా రావు.
బుక్‌షెల్ఫ్‌ను శుభ్రం చేసి సర్దిన కొద్ది రోజులకే సన్నటి పురుగులు వస్తుంటాయి. వాటిని అలాగే వదిలేస్తే పుస్తకాలను తినేస్తాయి. షెల్ఫ్‌లో గంధపుచెక్కను ఉంచితే పురుగులు దరి చేరవు. మార్కెట్‌లో అసలైన గంధపు చెక్క దొరకడం కొంచె కష్టమే. గంధం పొడిలో కొద్దిగా నీటిని కలిపి గోళీలుగా చేసి ఆరిన తర్వాత పుస్తకాల మధ్య పెట్టవచ్చు. బట్టల బీరువా పాత వాసన రాకుండా ఉండాలన్నా కూడా ఇదే ఫార్ములా.

ఆకుకూరలు వండేటప్పుడు ముదురుగా ఉన్న కాడలను తీసి పారేస్తుంటాం. అలాగే కొత్తిమీర కాడలు కూడా. ముదరు కాడలను చిన్న ముక్కలు చేసి లేదా మిక్సీలో కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేసి మొక్కలకు వేస్తే... చక్కటి ఎరువుగా పని చేసి మొక్కలు ఏపుగా పెరుగుతాయి.

 

మరిన్ని వార్తలు