ఇంటిప్స్‌

5 Jun, 2017 00:05 IST|Sakshi
ఇంటిప్స్‌

సిరామిక్‌ టైల్స్‌ మీద మరకలు పడితే ఆల్కహాల్‌తో రుద్దాలి. కొద్దిగా ఆల్కహాల్‌ వేసి ఆరిన తర్వాత తుడిస్తే  టైల్స్‌ మెరుస్తాయి. ఇలా చేసేటప్పుడు పిల్లలు ఆ దరిదాపుల్లోకి  రాకుండా చూసుకోవాలి. పైప్‌లు, షవర్లు శుభ్రం చేసుకోవడానికి ఫాస్ఫారిక్‌ యాసిడ్‌ని ఉపయోగించవచ్చు. అయితే గీతలు పడేటట్లు రుద్దకూడదు.

షవర్‌ రంధ్రాలు మూసుకుని పోతే  నిమ్మకాయ రసంతో రుద్దాలి.ఉడెన్‌ ఫర్నిచర్‌పై నెయిల్‌ పాలిష్‌ చిందితే దానిని వెంటనే తుడవకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తరువాత దానిని గట్టి అట్టలాంటి దానితో రుద్ది తీసి వేయాలి. అక్కడ వాక్స్‌ రాస్తే నెయిల్‌ పాలిష్‌ మరక ఉన్నట్టే అనిపించదు. ఫర్నిచర్‌ పాలిష్‌ రుద్దినా సరిపోతుంది.

మరిన్ని వార్తలు