ఇంటిప్స్‌

23 Sep, 2017 03:41 IST|Sakshi

రోజూ నాలుగైదు తులసి ఆకులు తింటే హెపటైటిస్, థైరాయిడ్‌ సమస్యలు రావు.
పంటి నొప్పితో బాధపడుతుంటే ఆ ప్రాంతంలో లవంగం పెడితే తగ్గుతుంది.
రుతుక్రమం ముందు వచ్చే ఆరోగ్య సమస్యలు తగ్గాలంటే జింజర్లీ ఆయిల్, గుడ్డు కలిపి తినాలి.
క్రమం తప్పకుండా రోజ్‌బెర్రీ తింటే నెలసరి బాధలనుంచి విముక్తి లభిస్తుంది.
మలబార్‌ ఆకును నీళ్లలో మరిగించి రసం తీసి ఆ రసానికి గుడ్డులోని తెల్లసొన కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
శొంఠి పొడిలో గసాల పొడి, చక్కెర కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
ఆవాల పేస్టులో తేనె కలిపి తీసుకుంటే శీతాకాలంలో వదలకుండా వేధిస్తున్న దగ్గును హరిస్తుంది.
తులసిఆకు రసం, వాము నీరు, తేనె సమపాళ్లలో కలిపి పరగడుపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడుతుంటే ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఏలకుల పొడి కలిపి పరగడుపునే తాగాలి.
 కడుపు నొప్పి తగ్గాలంటే జీలకర్ర పొడిలో చక్కెర కలిపి బాగా నమిలి తినాలి.

మరిన్ని వార్తలు