బాబు ఇంకా పక్క తడుపుతున్నాడు

8 Aug, 2019 09:43 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

పేనుకొరుకుడుకు చికిత్స ఉందా? :మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. ఈమధ్య ఒకేదగ్గర వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా?
– శ్రీలక్ష్మి, యాప్రాల్‌

పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్‌లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు.

కారణాలు: ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్‌ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ∙వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది.

లక్షణాలు: ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి.  తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి.

నిర్ధారణ:  ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్‌ పరీక్షలు, పిగ్మెంట్‌ ఇన్‌కాంటినెన్స్‌ వంటివే మరికొన్ని పరీక్షలు.

చికిత్స: పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు.దీనికి హోమియోలో యాసిడ్‌ ఫ్లోర్, సల్‌ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.
-డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్,హైదరాబాద్‌

బాబుఇంకా పక్క తడుపుతున్నాడు
మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్న వయసు నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఇప్పటికీ ఇది ఆగలేదు. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా?– ఎమ్‌డీ. రమీజా, గుంటూరు

మీ బాబు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే ఈ అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్‌ ఎన్యురెసిస్‌ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఈ సమస్య చిన్న పిల్లల్లోనే గాక కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్‌ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్‌’ అంటారు.

కారణాలు: నాడీవ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు (ముఖ్యంగా డౌన్‌సిండ్రోమ్‌), ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువసార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్‌–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు.

చికిత్స: పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలను దండించకూడదు. హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.-డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

బాబుకుఆటిజమ్‌...చికిత్ససూచించండి
మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్‌ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి.– డి. రాగిణి, వరంగల్‌
ఆటిజమ్‌ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు,  ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు  ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్‌ డిజార్డర్‌ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్‌ డిజార్డర్‌ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్‌ డిసింటిగ్రేటెడ్‌ డిజార్డర్‌ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.యాస్పర్జస్‌ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్‌ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవడలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్‌ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్‌ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్‌ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్‌ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.డాక్టర్‌ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్‌ హోమియోపతి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వయసు మీద పడితే?

మొక్కజొన్న బాల్యం

మేలు కోరితే మంచి జరుగుతుంది

హిట్‌ సినిమాల రూపకర్త..

అమ్మా... నాన్నా... ఓ పారిపోయిన అమ్మాయి

జావా నుంచి హైదరాబాద్‌కి...

పాదాలు పదిలంగా

చీమంత పాఠం

ఆమెలా మారి అతడిలా మారిన వ్యక్తిని పెళ్లాడింది

అపారం రైతుల జ్ఞానం!

ముదిమిలోనూ ఆదర్శ సేద్యం

డెయిరీ పెట్టుకోవటం ఎలా?

‘అక్షయ్‌కి అసలు ఆడవాళ్ల మధ్య ఏం పని?’

రుతురాగాల బంటీ

ఖండాంతర పరుగులు

'ఉన్నావ్‌' నువ్వు తోడుగా

హేట్సాఫ్‌ టు సాక్షి

లేడీస్‌ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు...

మాట్లాడితే రూపాయి నోట్ల దండలు

చిన్న జీవితంలోని పరిపూర్ణత

ఇక్కడ అందం అమ్మబడును

లోకమంతా స్నేహమంత్ర !

స్తూపిక... జ్ఞాన సూచిక

దేవుడే సర్వం స్వాస్థ్యం

కారుణ్యం కురిసే కాలం

ఒకరిది అందం.. మరొకరిది ఆకర్షణ

శ్రావణ మాసం సకల శుభాలకు ఆవాసం...

కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

కూరిమి తినండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌

కియారా కమిట్‌ అవుతుందా?

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో..

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

అదో బోరింగ్‌ టాపిక్‌

తోట బావి వద్ద...