వరుసగా గర్భస్రావాలు.. సంతానభాగ్యం ఉందా?

1 Aug, 2019 08:41 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

ఎంతోకాలంగాచెవి నొప్పి...తగ్గుతుందా?
మా పాప వయసు తొమ్మిదేళ్లు. తనకు గత మూడేళ్లుగా తీవ్రంగా చెవినొప్పి వస్తోంది. చెవిలో చీము, వాపు కూడా కనపడుతున్నాయి. ఈ ఏడాది ఈ సమస్య ప్రతిరోజూ వస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్‌టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్‌ చెయ్యాలంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స చెప్పండి. – ఎమ్‌. రాఘవులు, కోదాడ

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్‌ ఒటైటిస్‌ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్నపిల్లలు దీని బారినపడతారు.

కారణాలు: ∙కర్ణభేరి (ఇయర్‌ డ్రమ్‌)కు రంధ్రం ఏర్పడటం ∙మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం ∙చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్‌ వల్ల ఈ సమస్య రావచ్చు.
లక్షణాలు: ∙తీవ్రమైన జ్వరం ∙వినికిడి లోపం ∙శరీరం సంతులనం కోల్పోవడం ∙చెవి నుంచి చీము కారడం ∙ముఖం బలహీన పడటం ∙తీవ్రమైన చెవి/తలనొప్పి ∙చెవి వెనకాల వాపు రావడం.
నిర్ధారణ: ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్‌–రే
చికిత్స: దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్‌మూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి.-డా‘‘ శ్రీకాంత్‌ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్‌ఇంటర్నేషనల్,హైదరాబాద్‌

వరుసగాగర్భస్రావాలు...సంతానభాగ్యం ఉందా?
నా వయసు 34 ఏళ్లు. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా?– సుమశ్రీ, నిజామాబాద్‌

గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్‌ ప్రెగ్నెన్సీ లాస్‌’గా పేర్కొంటారు.

కారణాలు: ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ∙గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ∙గర్భాశయంలో కణుతులు / పాలిప్స్‌ ఉండటం ∙గర్భాశయపు సర్విక్స్‌ బలహీనంగా ఉండటం ∙కొన్ని రకాల ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు ∙కొన్ని ఎండోక్రైన్‌ వ్యాధులు ∙వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ∙రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు.
చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే  గర్భస్రావానికి దారితీసే అనేక కారణాలు కనుగొని, వాటికి తగిన చికిత్స అందించడంతో పాటు కాన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.-డాక్టర్‌ కె. శ్రీనివాస్‌ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

యానల్‌ ఫిషర్‌కు చికిత్స ఉందా?
నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్‌  ఫిషర్‌ అని చెప్పారు. ఆపరేషన్‌ చేయాలన్నారు. ఆపరేషన్‌ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా?
– ఎమ్‌. రామ్మోహన్‌రావు, సిద్దిపేట

మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్‌ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్‌ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్‌ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్‌ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం          ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్‌ సమస్య వస్తుంది.
లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు  నొప్పి, మంట.
చికిత్స: ఫిషర్‌ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్‌ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే ఫలితం ఉంటుంది.-డాక్టర్‌ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యాంటీ డిసీజ్‌ ఆహారం

తండ్రి లేడు... అమ్మ టైలర్‌

పశ్చాత్తాప దీపం

ఆ కాపురంపై మీ కామెంట్‌?

నవ లావణ్యం

పిడుగు నుంచి తప్పించుకోవచ్చు.. 

పాప ముఖం మీద మచ్చలు.. తగ్గడం ఎలా? 

స్త్రీ విముక్తి చేతనం 

న్యూస్‌ రీడర్‌ నుంచి సీరియల్‌ నటిగా! 

ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్‌

గుండె రంధ్రం నుంచి చూస్తే...

శివుడి ప్రీతి కోసం కావడి వ్రతం

అల్లంతో హైబీపీకి కళ్లెం!

క్షీర చరిత్ర

కందకాలతో జలసిరి!

ఆకుల దాణా అదరహో!

హెయిర్‌ కేర్‌

ఎవరు చెబితేనేమిటి?

వెరవని ధీరత్వం

భార్య, భర్త మధ్యలో ఆమె!

రెడ్‌ వైన్‌తో ఆ వ్యాధులకు చెక్‌

ఇవి తింటే క్యాన్సర్‌ నుంచి తప్పించుకోవచ్చు

నేడు మహాకవి 88వ జయంతి 

శరీరం లేకపోతేనేం...

ముఖ తేజస్సుకు...

నిత్యం కూర్చుని చేసే ఉద్యోగంలో ఉన్నారా?

జనారణ్యంలో కారుణ్యమూర్తి

లోబిపి ఉంటే...

డీజిల్‌ పొగలో పనిచేస్తుంటా... లంగ్స్‌ రక్షించుకునేదెలా?

పంటశాలలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..