సోరియాసిస్ - హోమియో వైద్యం

31 Jul, 2013 23:46 IST|Sakshi
సోరియాసిస్ - హోమియో వైద్యం

దీర్ఘకాలం పాటు బాధించే మొండి చర్మ వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచ వ్యాప్తంగా 125 మిలియన్ల మంది సోరియాసిస్‌తో బాధపడుతున్నారని అంచనా. అంటే ప్రపంచజనాభాలో మూడు శాతం స్త్రీ, పురుష తేడా లేకుండా అందర్నీ బాధించే సోరియాసిస్ వ్యక్తిగతంగానూ, సామాజికంగానూ ఇబ్బందులు సృష్టిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన బాధితులు శారీరకంగాను, మానసికంగాను ఎంతో నలిగిపోతున్నారు. అయితే హోమియోపతి వైద్యవిధానం సూచించిన సంపూర్ణ శారీరక, మానసిక తత్వశాస్త్రాన్ని అనుసరించి, సత్వర పరిష్కారాల కోసం చూడకుండా శాశ్వత సాంత్వన చర్యలు చేపట్టడం ద్వారా ఈ వ్యాధి మీద అంతిమ విజయం సాధించవచ్చు.

సోరియాసిస్ అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే చర్మ వ్యాధి. చర్మంపైన దురదతో కూడిన వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి. ఈ పొలుసు ఎరుపుదనాన్ని, వాపునీ కలిగి ఉండవచ్చు. కేవలం చర్మం మాత్రమే కాకుండా గోళ్ళు తల, తదితర శారీరక భాగాలు కూడా వ్యాధి ప్రభావానికి లోనుకావచ్చు. మొదట్లో సోరియాసిస్ మచ్చలు ఎర్రగా కమిలిపోయినట్లు కనిపించినా, సమయం గడిచే కొద్దీ ఈ మచ్చలపైన తెల్లని పొలుసులు మందంగా పేరుకుపోతాయి. పొలుసులు తొలగిస్తే అడుగున రక్తపు చారికలు కనిపిస్తాయి.
దురద ప్రధాన లక్షణం కాదు. అయితే వాతావరణం చల్లగా ఉండి తేమ తగ్గిపోయినప్పుడు కాని, ఇన్‌ఫెక్షన్ల వంటివి తోడైనప్పుడుగాని తీరుబడిగా ఉన్నప్పుడుగాని దురద ఎక్కువవుతుంది. బాధితుల్లో 10-20 శాతం మందికి అనుబంధ లక్షణంగా తీవ్రమైన కీళ్ళనొప్పులు కూడా ప్రాప్తిస్తాయి.

అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది: మాములుగా ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింది కొత్త కణాలు నిరంతరమూ తయారవుతుంటాయి. సుమారు నెల రోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పైపొరగా ఏర్పడినవి క్రమంగా నిర్జీవమై ఊడిపోయి కింది కణాలను బహిర్గత పరుస్తాయి. సోరియాసిస్ వ్యాధిలో ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మపు కణాలు వేగంగా తయారై మూడు, నాలుగు రోజులకే వెలుపలకు చేరుకుంటాయి. అదనపు కణ సముదాయానికి పోషకతత్వాలను అందించే నిమిత్తం రక్తసరఫరా పెరుగుతుంది. దీంతో చర్మంపైన ఎర్రగా మచ్చలు తయారవటం, పొలుసులు ఏర్పడటం జరుగుతాయి.

సోరియాసిస్-రకాలు
సోరియాసిస్ వ్యక్తమయ్యే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా వర్గీకరించారు. స్థూలంగా అవి 1) సోరియాసిస్ వల్గారిన్  2) గట్టేట్ సోరియాస్ (గట్టా అంటే బిందువు 3. పుస్టులార్ (పస్ అంటే చీము) 4) ఎరిత్రోడెర్మల్ సోరియాసిస్ (ఎరిత్రో అంటే ఎరుపు).

చికిత్సా విధానం- హోమియోపతి దృక్పథం
ఏదైతే వ్యాధికారణమవుతుందో అదే చికిత్సకు ఉపయోగపడుతుందనే ప్రకృతి సహజ సిద్ధాంతం పై హోమియోపతి వైద్యవిధానం ఆధారపడి ఉంది. దీనిని లాటిన్‌లో ‘‘సిమిరియా సిమిలిబస్ క్యూరాన్‌టర్’’ (Similia similibus curenter) అంటారు. ఇంచుమించు మన ‘‘ఉష్ణం ఉష్ణేన శీతలం’’ లాంటిదని చెప్పవచ్చు.

ఒకే రకమైన ప్రేరణ లేదా ప్రేరకానికి భిన్న వ్యక్తులు భిన్న రకాలుగా స్పందిస్తారనే అస్తివాదం పైన హోమియోపతి ఆధారపడి ఉంది. దీన్నే మూర్తిత్వ వ్యక్తిత్వ మంటారు. హోమియోపతికి మాత్రమే సంబంధించిన విలక్షణ అంశమిది.

సోరియాసిస్ విషయంలో వెంటనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. హోమియో వైద్యవిధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మందుల ఎంపికలో కూడా మానసిక-శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకుని మందులను సూచిస్తారు. అయితే చికిత్సా ఫలితాలు ఆహార-వ్యవహార, ఔషధాల సమిష్టి ప్రయోగాన్ని బట్టి, వ్యాధి ఉద్ధృతిని బట్టి ఉంటాయి.

సోరియాసిస్‌కు సాధారణంగా అర్సెనికం ఆల్బం (శీతకాలం ఎక్కువవుతుంది), సల్ఫర్, కాలిఆర్స్, సోరినమ్, మెజీరియం, పెట్రోలియా వంటి మందులను వాటి వాటి లక్షణాలకనుగుణంగా వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఇవి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలి.

ఎందుకు వస్తుంది?
వ్యాధినిరోధకశక్తి వికటించి స్వయం ప్రేరితంగా మారటం వలన సోరియాసిస్ వస్తుందని ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవాలంటే వ్యాధినిరోధకశక్తి గురించి తెలుసుకోవాలి. వైరస్, బ్యాక్టీరియా వంటివి దాడి చేసినప్పుడు వాటి నుంచి రక్షణ పొందటానికి, అవి ఏర్పరచిన అపశృతులను సరిచేయటానికి మన శరీరంలో తెల్లరక్తకణాలనే ప్రత్యేకమైన కణాలు పనిచేస్తుంటాయి. ఇవి అవసరమైన ప్రాంతాలను వెళ్ళి ఇన్ఫెక్షన్లను తగ్గించటమే కాకుండా గాయాలను మానేలా చేస్తాయి. దీనిని వ్యాధినిరోధకశక్తి అంటున్నాం.

ఈ నేపథ్యంలో అనుబంధ అంశంగా ఇన్‌ఫ్లమేషన్ (ఎరుపుదనం, వాపు) తయారవుతుంది. సోరియాసిస్‌తో ఈ వ్యాధినిరోధకశక్తి అపక్రమంగా తయారవుతుంది. ఇది శరీర కణజాలాన్ని (చర్మకణజాలం) అన్యపదార్థంగా అన్వయించుకొని, దాడి చేసి ఇన్‌ఫ్లమేషన్ కలిగిస్తుంది. ఫలితంగాచర్మ కణాలు అనియతంగా పెరిగి పొలుసులుగా తయారవుతాయి.

అయితే వ్యాధినిరోధకశక్తిలో ఈ మార్పులు జన్యుపరమైన కారణాల వల్ల జరుగవచ్చు. మానసికఒత్తిడి, ఆహారపు అలవాట్లు కొన్నిసార్లు ప్రేరకాలుగా పనిచేస్తాయి.

డాక్టర్ మురళి అంకిరెడ్డి,
ఎం.డి (హోమియో),
స్టార్ హోమియోపతి,
సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్,  కూకట్‌పల్లి,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
రాజమండ్రి, కర్ణాటక
www.starhomeo.com: 7416107107 / 7416109109
 

మరిన్ని వార్తలు