హోమియో వైద్యంతో పార్శ్వపు నొప్పి మాయం

9 Nov, 2013 00:29 IST|Sakshi

ప్రతి వంద మందిలో 15 నుండి 20 మంది ఈ వ్యాధితో బాధ పడుతున్నారు. ఇది సాధారణంగా 15 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు వారిలో అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
 
 ఈ సమస్య పురుషులలో కంటే స్త్రీలలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
 పార్శ ్వపు నొప్పితో (Migraine) బాధ పడుతున్నారా అని తెలుసుకోవటం ఎలా
 =నెలలో 5 కంటే ఎక్కువసార్లు తలనొప్పి రావటం
 
 =తలనొప్పి 4 గంటల నుండి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది
 
 =కనీసం రెండు సార్లు అయినా తలలో ఏదో ఒక వైపు నొప్పి రావటం
 
 =వాంతులు అవటం, శబ్దం లేక వెలుతురు భరించలేకపోవటం వంటి లక్షణాలు తలనొప్పితో పాటు కానీ తలనొప్పి ముందు కానీ ఉండడటం
 
 =AURAతో కూడిన తలనొప్పి- అంటే... తలనొప్పి వచ్చే ముందు... కళ్లు మసకబారటం, కళ్ల ముందు వెలుతురు కనిపించటం, మెరుపులు ప్రకాశవంతమైన జ్యోతుల లాంటివి కనిపించటం మొదలగు లక్షణాలను కలిపి అ్ఖఖఅ అని అంటారు.
 
 పార్శ్వపు నొప్పి అనగా
 చాలా తీవ్రమైన తలనొప్పి ఉండటం మరియు ఏదో ఒక వైపు తలనొప్పి రావటం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఇది మెడ వెనుక భాగంలో ప్రారంభమై కంటి వరకు వ్యాపిస్తుంది. తలనొప్పి వచ్చే ముందు కళ్లు మసక బారటం, తల తిరగటం వంటి లక్షణాలతో తలనొప్పి వస్తుంది. కడుపులో వికారంగా ఉండటం లేదా వాంతులు కావటం వంటి లక్షణాలు పార్శ్వపునొప్పిలో సాధారణం.
 
 పార్శ్వపు నొప్పికి కారణమైన నిర్దిష్టమైన జీవప్రక్రియ వ్యవస్థ గురించి తగిన శాస్త్రీయ ఆధారాలు ఇప్పటికీ అందుబాటులో లేవు. కానీ తలలోని నరాలలో కొన్ని రకాల రసాయనాలు అధిక మోతాదులో విడుదల కావటం వల్ల పార్శ్వపు నొప్పి వస్తుందని అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
 
 పార్శ్వపు నొప్పి రావటానికి గల కారణాలు
 =శారీరక మరియు మానసిక ఒత్తిడి
 
 =నిద్ర లేకపోవటం
 
 =ఎక్కువసేపు ఆకలిగా ఉండటం మరియు సమయానికి భోజనం చేయక పోవటం
 
 =స్త్రీలలో హార్మోన్ హెచ్చు తగ్గుల వల్ల కూడా పార్శ్వపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా నెలసరి సమయంలోను, గర్భిణీ స్త్రీలలోను మరియు మెనోపాజ్ సమయంలో చూస్తూ ఉంటాము
 
 =అతి వెలుగు, గట్టి శబ్దాలు మరియు ఘాటైన సువాసనలు పార్శ్వపునొప్పికి కారణాలు కావచ్చు
 
 =పొగతాగటం లేదా ఇంట్లో పొగతాగే వారుండటం
 
 =మద్యం సేవించటం లేదా ఇతర మత్తు పదార్థాలు కూడా పార్శ్వపునొప్పికి కారణం కావచ్చు.
 
 పైన పేర్కొన్న కారణాలకు దూరంగా ఉండటం వల్ల కొంతవరకు తలనొప్పిని రాకుండా చేయటం లేదా అదుపులో ఉంచటం చేయవచ్చు.
 
 లక్షణాలు:  పార్శ్వపు నొప్పిలో చాలా రకాల లక్షణాలు ఉంటాయి. వాటిని మూడు రకాలుగా విభజించవచ్చు.
 =పార్శ్వపునొప్పి వచ్చే ముందు కనిపించే లక్షణాలు (PRODROME & AURA) ఈ లక్షణాలు పార్శ్వపునొప్పి వచ్చే కొన్ని గంటలు లేదా నిమిషాల ముందు వస్తాయి.
 =చిరాకు, నీరసం, అలసట, నిరుత్సాహం.
 =కొన్ని రకాల తినుబండారాలను ఎక్కువగా ఇష్టపడటం
 =వెలుతురు మరియు శబ్దాన్ని తట్టుకోలేకపోవటం
 =కళ్లు మసక బారటం, కళ్ల ముందు మెరుపులు లేదా వెలుతురు కనిపించటం జరుగవచ్చు. వీటినే అ్ఖఖఅ అంటారు.
 

2. పార్శ్వపు నొప్పి సమయంలో వచ్చే లక్షణాలు (paInphase)
 =సాధారణం నుండి అతి తీవ్రమైన తలనొప్పి
 =తలలో ఒక వైపు ఎక్కువగా తలనొప్పి ఉండటం
 =పని చేస్తున్నప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువ అవటం
 =నొప్పి సాధారణంగా 4 గంటల నుండి 72 గంటల వరకు ఉండవచ్చు.
 =కడుపులో వికారం లేదా వాంతులు అవటం
 
 3.  పార్శ్వపునొప్పి వచ్చిన తరువాత లక్షణాలు
 =చిరాకు ఎక్కువగా ఉండటం నీరసంగా ఉండటం
 =వికారం, వాంతులు, విరోచనాలు కావటం
 
 హోమియో కేర్ ఇంటర్ నేషనల్ నందు

 జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ వైద్య విధానం ద్వారా మరియు ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన కచ్చితమైన చికిత్స ద్వారా పార్శ్వపు నొప్పి తీవ్రతనే కాకుండా పార్శ్వపునొప్పిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు లేని మరియు వ్యాధిని సమూలంగా నిర్మూలించే ప్రత్యేక వైద్యం కేవలం హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌కే సొంతం.
 
 రోగ నిర్థారణ పరీక్షలు
 పార్శ్వపునొప్పిని నిర్థారించుకోవటానికి ఖచ్చితమైన రోగనిర్థారణ పరీక్షలు లేవు. రోగ లక్షణాలను బట్టి ఎక్కువసార్లు పార్శ్వపునొప్పిని నిర్థారించటం జరుగుతుంది.
 
 ఈసీజీ, సీటీ-బ్రెయిన్, ఎమ్మారై-బ్రెయిన్ మొదలగు పరీక్షలు చేయటం ద్వారా ఇతరత్రా తీవ్రమైన వ్యాధులు లేవని నిర్థారించుకోవటం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నిర్థారించుకోవచ్చు.
 
 డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్
 సి.ఎం.డి.,
 హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
 ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99
 టోల్ ఫ్రీ: 1800 102 2202
 బ్రాంచ్‌లు:  హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.

 

మరిన్ని వార్తలు