పొడి చర్మానికి హనీ ప్యాక్

15 Mar, 2016 23:04 IST|Sakshi
పొడి చర్మానికి హనీ ప్యాక్

బ్యూటిప్స్
 

చర్మాన్ని పొడిబారకుండా కాపాడడంలో మొదటి స్థానం తేనెదే. తేనె కలిపిన ప్యాక్ వేసుకుంటే ముఖంలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. నాలుగు కీరదోస ముక్కలు, ఒక టేబుల్ స్పూను కమలాపండు రసం, ఒక స్ట్రాబెర్రీ, ఒక టీ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ మీగడ కాని పెరుగు కాని తీసుకోవాలి. అన్నింటినీ కలిపి మిక్సీలో బ్లెండ్ చేసు కోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. కీరకాయ, కమలారసం, స్ట్రాబెర్రీ చర్మానికి తాజాదనాన్నిస్తాయి.

తేనె, పెరుగు మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి.  బంతిపువ్వు రెక్కలు(ఒక పువ్వు), ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూను పాలు కాని మీగడ కాని తీసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. వారానికి ఒకటి-రెండు సార్లు మాత్రమే వాడాలి. బంతిపూలు దొరకని రోజుల్లో సెలెండ్యులా క్రీమ్ వాడవచ్చు. ఇది మార్కెట్‌లో దొరుకుతుంది.
 
 

మరిన్ని వార్తలు