బయటి తిండితో హార్మోన్‌ సమస్యలు

3 Apr, 2018 00:31 IST|Sakshi

అవసరం కొద్దీ అనివార్యంగా కొందరు బయటి తిండి తింటుంటారు. ఇంకొందరు రుచుల కోసం బయటి తిండికి అలవాటు పడుతుంటారు. కారణాలు ఏవైనా సరే, బయటి తిండి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని ఒక తాజా అధ్యయనం వెలుగులోకి వచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తినే తిండి వల్ల జీర్ణకోశ సమస్యలు, స్థూలకాయం, డయాబెటిస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసిందే.

రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం, ప్యాకింగ్‌ కోసం వాడే పదార్థాల్లో ఉండే ఫ్తాలేట్స్‌ అనే రసాయనాలు ఆహారంలో కలుస్తాయని, ఇలాంటి చోట్ల ఆహారం తీసుకున్నట్లయితే, ఆ రసాయనాలు శరీరంలోకి చేరి, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని పరీక్షల్లో తేలినట్లు ‘ఎన్విరాన్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌’ జర్నల్‌ ఒక వ్యాసంలో వెల్లడించింది. 

మరిన్ని వార్తలు