వయసు పైబడుతున్నా ఫిట్‌నెస్ ఎలా?

26 Oct, 2015 23:59 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్
 
నా వయసు 40. ఎత్తు 5.4 అంగుళాలు. బరువు 78 కిలోలు. ఇటీవల లిపిడ్ ప్రొఫైల్ టెసట్ చేయిస్తే బ్యాడ్ కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందన్నారు. హోమియోలో దీన్ని తగ్గించవచ్చా?
 - ఎస్.పవన్ కుమార్, తెనాలి

 మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న శారీరక, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా వస్తున్న వ్యాధుల్లో కొలెస్ట్రాల్ ఒకటి. సాధారణంగా కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమైనదే అనే మాట తరచు వినిపిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ పెరగడం వల్లే కాదు, తగ్గడం వల్ల కూడా సమస్యలు తప్పవు. ఎందుకంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణానికీ కొలెస్ట్రాల్ కావాలి. అలాగే విటమిన్ - డి, హార్మోన్ల తయారీకి కొలెస్ట్రాల్ కావలసిందే. గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండడంతో ఇటీవల కాలంలో చాలామంది కొలెస్ట్రాల్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

కొలెస్ట్రాల్ రెండు రకాలు. అందులో హైడెన్సిటీ లైపో ప్రొటీన్స్ (హెచ్.డి.ఎల్): ఇది మనకు మేలు చేసేది. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. దీని సాధారణ విలువ 40-60 మధ్యన ఉండాలి. అరవైకన్నా ఎక్కువ ఉంటే గుండెలోని రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు. లో డెన్సిటీ లైపో ప్రొటీన్స్(ఎల్ డీ ఎల్) ఇది హానికరమైనది. రక్తప్రవాహంలో ఆటంకాలు కలిగించే కొలెస్ట్రాల్ ఇది. డెసీలీటరుకు 130 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉండటం మంచిది. అంతకు మించితే ధమనుల్లో కొవ్వు చేరి, గుండెపోటు, పక్షవాతం వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను చెడు కొలెస్ట్రాల్ అంటారు.

కారణాలు: చక్కెర, కొవ్వు, పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, వేపుడుపదార్థాలు, వెన్న, నెయ్యి, మాంసం, జంక్‌ఫుడ్స్, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, గర్భనిరోధక మందులు, మూత్రం ఎక్కువగా రావడానికి వాడే మందులు, వంశపారంపర్యత, మద్యపానం, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఒత్తిడి, ఆందోళన, పౌష్టికాహార లోపం.

జాగ్రత్తలు: నడక వల్ల మంచి కొవ్వు స్థాయి పెరగవచ్చు, ఆల్కహాల్, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, సిగరెట్లు మానేయాలి. పీచు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, ఆహారం, ఓట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను పూర్తిగా నియంత్రించవచ్చు.

 నిర్ధారణ: లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష. హోమియో చికిత్స: కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. దీనిని సాధారణంగా వాడే మందులు కాల్కేరియా కార్బ్, ఫైటోలిక్కా, కొలెస్ట్రినమ్, గ్రాఫైటిస్, కాక్టస్, రావుల్ఫియా, సర్పెంటైనా, ఫ్యూకస్. వీటిని నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో కాన్‌స్టిట్యూషనల్ విధానంలో వాడితే మంచి ఫలితం ఉంటుంది.     
 
న్యూరాలజీ కౌన్సెలింగ్
 
 మా బాబుకు నాలుగేళ్లు. ఇప్పటికి ఒక ఏడాదిలోపు మూడు సార్లు ఫిట్స్ వచ్చాయి. ఈ మూడుసార్లు కూడా జ్వరం వచ్చినప్పుడు మాత్రమే మా బాబుకు ఫిట్స్ వచ్చాయి. మేము డాక్టర్‌ను సంప్రదించాలనుకుంటున్నాము. దయచేసి సలహా ఇవ్వండి.
 - మనోహర్‌రావు, నల్గొండ

 చిన్నపిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ రావడం అనేది చాలాసార్లు అంత భయపడాల్సిన విషయం కాదు. వాటిని ఫిబ్రైల్ సీజర్స్ అంటారు. వాటికోసం ఫిట్స్‌వ్యాధి ఉన్నవారిలోలాగా పిల్లలకు రోజూ మాత్రలు వేయాల్సిన అవసరం ఉండదు. జ్వరం వచ్చినప్పుడు మాత్రమే పారాసిటమాల్ వంటివి తీసుకొని, వాటితో పాటు మూడు లేదా నాలుగు రోజులు ఫిట్స్‌కు సంబంధించిన మాత్రలు డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే సరిపోతుంది. వీటి నిర్ధారణ పరీక్షలు కూడా అవసరం ఉండదు. చాలా కొద్దిమందిలో మాత్రం ఫిట్స్ లేదా ఎక్కువ సేపు వచ్చినా ఎక్కువసార్లు వచ్చినా లేదా వాటితో పాటు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నప్పుడు ఫిట్స్‌కు సంబంధించిన మాత్రలు ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం రావచ్చు. మీకు దగ్గర్లో ఉన్న చిన్నపిల్లల వైద్యులు లేదా న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి చికిత్స తీసుకోండి.
 
నాకు 24 ఏళ్లు. నేను ఎనిమిదేళ్లుగా ఫిట్స్ మందులు వాడుతున్నాను. నాకు ఏడాది క్రితం పెళ్లయ్యింది. నేను పిల్లలను కనచ్చా? ముందు మందులు మానేయవచ్చా? సలహా ఇవ్వండి.
 - మంజుల, నందిగామ

 ఫిట్స్ వ్యాధి ఉన్న మహిళలు మందుల ద్వారా ఫిట్స్‌ను నియంత్రించుకున్న తర్వాత గర్భం దాల్చవచ్చు. మందులు వాడుతున్నవారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భంలో పెరిగే శిశువుకు మందుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు రాకుండా తగ్గించుకోవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్టర్ సూచనలు లేకుండా మందులు మానకూడదు. మీ విషయంలో ఫిట్స్ రెండేళ్ల నుంచి రావడం లేదు కాబట్టి ఒకసారి డాక్టరును సంప్రదించి, వీలుంటే మందులు పూర్తిగా ఆపేశాక గర్భం ధరించవచ్చు. ఒకవేళ మీ ఫిట్స్ మందులు ఆపడం సాధ్యం కాకపోతే గర్భం దాల్చకముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం ద్వారా గర్భస్థ శిశువుపై ఫిట్స్ మందుల ప్రభావం తగ్గించవచ్చు. డాక్టర్ల సలహా మేరకు సరైన మందులు వాడటం వల్ల పుట్టబోయే బిడ్డకు కలిగే ఇబ్బందులు నివారించవచ్చు.
 
 లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్
 
 నా వయసు 58 ఏళ్లు. గతం కంటే కొంత ఫిట్‌నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. నేను మునపటి ఆరోగ్యాన్నే కొనసాగించాలంటే మార్గాలేమిటి?
 - నర్సింహారావు, కరీంనగర్

 వయసు పెరుగుతున్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. ఇందుకోసం వ్యాధి లక్షణాలు ఉంటే తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎంతగానో దోహదపడతాయి. అందులో వ్యాయామం చాలా ముఖ్యమైనది. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, హైబీపీ, ఒబేసిటీ వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దానివల్ల వయసు పైబడ్డవారు పడిపోయినప్పుడు ఎముకలు విరిగే ప్రమాదం తగ్గుతుంది. వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి సూచనలు పొందాలి.

ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ సలహా పొందడం అవసరం. వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్‌సైజ్‌కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి గానీ, నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు బాగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేసి డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సూచనలను పొందాలి.
 
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నలుగురు ఓహ్‌ బేబీలు

పక్కింటి ఎండమావి

చీకటికి అలవాటుపడని కళ్లు

పెత్తనం పోయి కర్ర మిగిలింది

ఎత్తయిన సిగ్గరి

యువత. దేశానికి భవిత

బజ్జీ బిర్యానీ.. స్నాకం 'పాకం'

మద్దూరు వడను వదిలేస్తే బాధపడకతప్పదు..

చందమామ నవ్వింది చూడు

ఆఫీస్‌ ఇలా ఉండకూడదు

ప్లాస్టిక్‌ ఇల్లు

సౌరశక్తి ప్లాంట్‌లలో అబూదాబి రికార్డు!

మ్యావ్‌ మ్యావ్‌... ఏమైపోయావ్‌!

మా అమ్మపై ఇన్ని పుకార్లా

చక్కెర చాయ్‌తో క్యాన్సర్‌!

చిన్నారుల కంటి జబ్బులకు చికిత్సాహారం

మేము సైతం అంటున్న యాంకర్లు...

ఒత్తిడి... వంద రోగాల పెట్టు

చేతులకు పాకుతున్న మెడనొప్పి... పరిష్కారం చెప్పండి

మేనత్త పోలిక చిక్కింది

ఆ టీతో యాంగ్జైటీ మటుమాయం

టెడ్డీ బేర్‌తో సరదాగా ఓరోజు...!

వినియోగదారుల అక్కయ్య

‘జర్నలిస్ట్‌ కావాలనుకున్నా’

సోపు.. షాంపూ.. షవర్‌ జెల్‌..అన్నీ ఇంట్లోనే!

హెచ్ఐవీకి మందు దొరికింది!

అర్బన్‌ నోస్టాల్జిస్ట్‌లు

పరిసరాలను ముంచెత్తేసిన పెళ్లి!

ఆ గర్భిణి... కళ్లలో మెదిలేది..

వెయిట్‌ లిఫ్టింగ్‌తో గుండెకు మేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!