మీ దైనందిన జీవితం ఎలా ఉంది?

22 Jun, 2017 01:07 IST|Sakshi
మీ దైనందిన జీవితం ఎలా ఉంది?

సెల్ఫ్‌ చెక్‌

ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎన్నుకుంటారు. వారి జీవన విధానం రకరకాలుగా ఉంటుంది. రోజులో ఎంతో మందిని కలుస్తాం, ఎన్నో పనులు చేస్తాం. అయితే మీ రోజువారీ జీవితం ఎలా ఉంటుందో గమనించారా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు మీ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకున్నారా? సమాజంలో మీ పద్ధతి ఎలా ఉంటుందో మీకు తెలుసా? డైలీ లైఫ్‌లో మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవటానికి ఈ క్విజ్‌ పూర్తి చేయండి.

1.     మధ్యాహ్నం కన్నా ఉదయమే రిలాక్స్‌డ్‌గా ఉంటారు.
ఎ. అవును     బి. కాదు

2.     నడకలో కొంచెం వేగం, కాన్ఫిడెన్స్‌ ఉంటుంది.
ఎ. అవును     బి. కాదు

3.     ఇతరులతో మాట్లాడేటప్పుడు కదులుతూ ఉండరు. నిటారుగా నిలబడి మీ భావాలను పంచుకుంటారు.
ఎ. అవును     బి. కాదు

4.     ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు అవగాహన ఉంది.
ఎ. అవును     బి. కాదు

5.     ఇతరులు మిమ్మల్ని గేలి చేస్తున్నప్పుడు చిరునవ్వుతో ఉంటారేగాని, తిరిగి వారిని అపహాస్యం చేయరు.
ఎ. అవును     బి. కాదు

6.     పదిమంది కూడిన చోటికి Ðð ళ్లినప్పుడు తెలిసినవాళ్లని నవ్వుతూ పలకరిస్తారు. అందరూ మిమ్మల్నే చూసేవిధంగా ప్రవర్తించరు.
ఎ. అవును     బి. కాదు

7.     కష్టానికి ఫలితం దక్కకున్నా మీ విశ్వాసాన్ని కోల్పోరు.
ఎ. అవును     బి. కాదు

8.     ఆనందించాల్సిన క్షణాలను వదులుకోరు. డైట్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.
ఎ. అవును     బి. కాదు

9.     మీరు చేయాల్సిన బాధ్యతలను సంతోషంగా చేస్తారు.
 ఎ. అవును     బి. కాదు

10.    పడుకొనేటప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అనవసరమైన ఆలోచనలతో ఆందోళన చెందరు.
ఎ. అవును     బి. కాదు

మీ సమాధానాల్లో ‘ఎ’ లు ఎక్కువగా వస్తే మీ రోజువారీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారితో కమ్యూనికేట్‌ చేసేటప్పుడు పరిణతితో ప్రవర్తిస్తారు. మీ ప్రశాంత జీవనం వల్ల ఎలాంటి ఆందోళలకు గురవ్వకుండా ఉండగలరు. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే రోజులో మీ సంతోషం పాళ్లు తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఆలోచనలతో సతమతమవుతుంటారు.

మరిన్ని వార్తలు