లైఫ్‌ పార్టనర్‌ ఎలా ఉండాలనుకుంటున్నారు?

12 May, 2017 23:59 IST|Sakshi
లైఫ్‌ పార్టనర్‌ ఎలా ఉండాలనుకుంటున్నారు?

సెల్ఫ్‌చెక్‌


‘‘శీనుగాడికి వయసైపోతోందండీ త్వరగా పెళ్లి చేయాలి... గీత చదువు ఈ ఏడాదితో అయిపోతుంది కదా! అమ్మడు పెళ్లి విషయం ఆలోచించాలోయ్‌’’... ఇలా తల్లిదండ్రులు ఎదిగిన పిల్లల పెళిళ్ల గురించి ఆలోచించటం సహజం. పెద్దల సంగతి ఎలా ఉన్నా కాబోయే జీవితభాగస్వామి ఇలా ఉండాలని, సినిమాల్లో హీరో, హీరోయిన్లు పాటలు పాడుతుంటారు. కొందరు పైపై మెరుగులకో, ఫ్యాషన్‌కో ఇంపార్టెన్స్‌ ఇస్తే మరికొందరు జీవితాన్ని వాస్తవంగా చూస్తారు. మ్యారీడ్‌ లైఫ్‌ను లోతుగా గమనిస్తారు. మీరు మీ లైఫ్‌ పార్ట్‌నర్‌ ఎలా ఉండాలనుకుంటున్నారు? బాధ్యతాయుతంగా ఉండేవారిని ఇష్టపడుతున్నారా? లేక ఊహలకే  ప్రాధాన్యం ఇచ్చేవారిని కోరుకుంటున్నారా?

మీకు కాబోయే భార్య/భర్తకు మంచి మనసు ఉండాలని కేరింగ్‌ ఆటిట్యూడ్‌ ఉండాలనుకుంటారు. అందం మీ దృష్టిలో రెండోదిగా ఉంటుంది.
ఎ. అవును     బి. కాదు


వాస్తవ కథాంశంతో (రియాలిటీ బేస్డ్‌ డ్రామా) ఉన్న సినిమాలను ఇష్టపడతారు.
ఎ. అవును     బి. కాదు

భాగస్వామి ఇచ్చే బహుమతులకు ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వరు. వారిని అర్థం చేసుకోవటానికే చొరవ చూపిస్తారు.
ఎ. అవును     బి. కాదు

మీ లైఫ్‌ పార్ట్‌నర్‌కే ప్రాముఖ్యాన్నిస్తారు. ఇతర స్త్రీ/పురుషులతో చనువుగా ఉండాలనుకోరు. మీ హద్దులను దాటే ప్రయత్నం ఎప్పటికీ చేయరు.
ఎ. అవును     బి. కాదు

ఎవరో ఎక్కడో మీకోసం పుట్టే ఉంటారనే భావనతో మీరు ఏకీభవించరు.
ఎ. అవును     బి. కాదు

కాబోయే జీవితభాగస్వామిని పూర్తిగా నమ్ముతారు. వారి గతం గురించి ఆరా తీయరు, అనుమానించరు.
ఎ. అవును     బి. కాదు

మీ గురించి మీ భార్య/భర్త ఎప్పుడూ ఉన్నతంగా మాట్లాడాలను కోరు, వారి అభిప్రాయలకే చోటిస్తారు.
ఎ. అవును     బి. కాదు

లైఫ్‌పార్ట్‌నర్‌ ప్రాక్టికల్‌గా ఉండటానికే ఇష్టపడతారు.
ఎ. అవును     బి. కాదు

భార్యాభర్తలు కాకముందే ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుందనుకుంటారు.
ఎ. అవును     బి. కాదు

లైఫ్‌పార్ట్‌నర్‌ నుంచి చిన్న ఇబ్బందులొచ్చినప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం మీలో ఉంటుంది.
ఎ. అవును     బి. కాదు

‘బి’ లు ఏడు వస్తే మీరు జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. లైఫ్‌పార్ట్‌నర్‌ విషయంలో కూడా మీ ఆటిట్యూడ్‌ అలానే ఉంటుంది. క్రమశిక్షణ మీకు చాలా తక్కువగా ఉంటుంది. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌ మీద కూడ మీకు నమ్మకం ఉండచ్చు. వాస్తవికతకు చాలా దూరంగా ఉంటారు. ‘ఎ’ లు ఏడు దాటితే మీరు ఉన్నతమైన జీవితభాగస్వామి కోసం ఎదురు చూస్తుంటారు. పూర్తి పాజిటివ్‌ లక్షణాలున్న లైఫ్‌పార్ట్‌నర్‌ కావాలనుకుంటారు. అదేవిధంగా మీరూ ప్రవర్తించగలరు. జీవితభాగస్వామిలో రియాలిటీనే ఇష్టపడతారు.

మరిన్ని వార్తలు