గోరు... అనిపించకూడదు బోరు..!

21 Mar, 2017 00:36 IST|Sakshi
గోరు... అనిపించకూడదు బోరు..!

నెయిల్  జిగేల్

గోళ్లు మరీ బలహీనంగా ఉంటే వాటిని నీళ్లతో తడిపి గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌లో రోజు విడిచి రోజు 20 నిమిషాల పాటు ఉంచితే బలంగా తయారవుతాయి. మ్యానిక్యూర్‌ చేయించేప్పుడు ఒక్కోసారి బ్యుటీషియన్స్‌ గోటి క్యూటికిల్‌ కూడా తీసేస్తారు. ఇలా చేయడం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు రావచ్చు. వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నెయిల్‌ పాలిష్‌ తీసేసి మళ్లీ వేసుకోవడం సరికాదు. అంటే... వారానికి ఒకసారి ఒక్క నెయిల్‌ పెయింట్‌ మాత్రమే వేసుకోవడం ఆరోగ్యకరం. 

మీ గోళ్లకు స్వాభావికమైన మెరుపు రావాలంటే వాటిపై పెట్రోలియమ్‌ జెల్లీ పూసి, పాలిష్‌ చేసినట్లుగా ఒక పొడి గుడ్డతో బఫ్‌ చేయాలి. గోళ్లకు సబ్బు తగిలి ఉంటే అవి పెళుసుగా మారిపోతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే, లేదా చేతులు శుభ్రం చేసుకున్న వెంటనే వాటికి తగిలి ఉన్న సబ్బు పోయేలా కడిగి పొడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి. గోరు ఆరోగ్యం కోసం బ్రాకోలీ, చేపలు, ఉల్లి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ఆకుపచ్చని కూరలు తీసుకుంటూ ఉంటే గోరు మరింత ఆరోగ్యంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు