పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి?

11 Feb, 2016 08:16 IST|Sakshi
పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి?

ఎగ్జామ్ టిప్స్
 

మైండ్ అనేది కంప్యూటర్‌లోని హార్డ్ డిస్క్ లాంటిది. అందులో మనం ఎంత సమాచారాన్ని అయినా నిల్వచేసుకోవచ్చు. ఫలానా దానిని మీరు గుర్తుంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోకపోతే... అది మీ పరిశీలనకు అందడం గాని, గుర్తుండడం గాని కష్టం. కాబట్టి... ఆసక్తిగా, గుర్తుంచుకునేలా చదవడం ముఖ్యం.   {పాక్టీస్ వల్లే ఏ హ్యాబిట్ అయినా పర్ఫెక్ట్ అవుతుంది.  ఏ పని చేస్తుంటే దాని మీద దృష్టి కేంద్రీకరించడం అలవాటు చేసుకోవాలి. అపుడు చదువు విషయంలో కూడా అనుసరించడం తేలికవుతుంది.

బ్రెయిన్‌కి ప్రశ్నలు వెళితే దానికి సమాధానం తెల్సుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే ఏకాగ్రత కుదరకపోవడం. ఎలాగంటే ఉదాహరణకు మీరు చదువుతున్నపుడు ఇంటి ముందుగా ఏదైనా బ్యాండ్‌మేళం శబ్దం వినపడిందనుకోండి... ‘‘అది పెళ్ళిదా లేకపోతే ఏదైనా దేవుడి ఊరేగింపా...’’ వగైరా ప్రశ్నలు మనకు తెలీకుండానే బ్రెయిన్‌కి చేరతాయి. 

వాటికి సమాధానాలు తెల్సుకోవాలని తహతహలాడుతుంది. దాంతో మీ ఏకాగ్రత చెదురుతుంది. అందుకే చదివేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. ఇలా జరగకుండా ఉండడానికి మార్గం ఏమిటంటే... బ్రెయిన్‌ను ఎప్పటికప్పుడు  స్టడీస్‌కు, సబ్జెక్టులకు  సంబంధించిన ప్రశ్నలతో నింపేస్తూ ఉండడం{బెయిన్‌కి టార్గెట్ ఫిక్స్ చేస్తే ఆటోమేటిగ్గా దాన్ని చేరుకునేందుకు సిద్ధపడుతుంది. లక్ష్యం లేకుండా చదవవద్దు. ‘‘ఈ గంటలో నేనీ చాప్టర్ ఫినిష్ చేయాలి. ఈ అరగంటలో ఈ రివిజన్ పూర్తయిపోవాలి’’ లాంటి లక్ష్యంతోనే చదవడం ప్రారంభించాలి.
 

మరిన్ని వార్తలు