మీ టూర్‌ ప్లానింగ్‌ ఎలా ఉంటుంది..? 

20 Apr, 2018 00:51 IST|Sakshi

సెల్ఫ్‌ చెక్‌

కొత్త కొత్త ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలను చూడటం వల్ల విజ్ఞానంతో పాటు వినోదం కూడా దొరుకుతుంది. అందుకే చాలా మంది ఏడాదిలో ఒక్కసారైనా ఏదో కొత్త ప్రదేశానికి టూర్‌ ప్లాన్‌ చేసుకుంటారు. అయితే మరికొందరు మాత్రం ముందస్తు టూర్‌ ప్రణాళిక వేసుకోరు. దాంతో కొత్త ప్రదేశంలో ఇబ్బందులు పడతారు. మీరు టూర్‌ ప్లానింగ్‌లో ఎంత పర్‌ఫెక్ట్‌గా ఉంటారు? చెక్‌ చేసుకోండి.  

1.    మీరు వెళ్తున్న ప్రదేశం గురించి ముందుగానే ఇంటర్‌నెట్‌లోనో, గైడ్‌ నుంచో సమాచారం సేకరిస్తారు. 
    ఎ. అవును     బి. కాదు 

2.    అవసరమైన మేరకు నగదు ఉంచుకుని డెబిట్‌ కార్డ్స్, క్రెడిట్‌ కార్డ్స్, ట్రావెల్‌ చెక్స్‌ వంటివి దగ్గర పెట్టుకుంటారు. 
    ఎ. అవును     బి. కాదు 

3.    అక్కడి వాతావరణం, వేసుకోవాల్సిన దుస్తుల గురించి వాకబు చేస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

4. ఫస్ట్‌ ఎయిడ్‌ కోసం అవసరమైన  మందులను క్యారీ చేస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

5. కలుషితమైన నీళ్లు తాగే ప్రమాదాన్ని నివారించడానికి వాటర్‌బాటిల్‌ను క్యారీ చేస్తారు. 
    ఎ. అవును     బి. కాదు 

6.    మీరు వెళ్లాల్సిన ప్రదేశం రూట్‌ మ్యాప్‌ను జాగ్రత్తగా స్టడీ చేస్తారు.     ఎ. అవును     బి. కాదు 

7.    మీరు వెళ్లే ప్రదేశంలోని హోటల్స్, బస చేయదగ్గ ప్రదేశాల గురించి ముందుగానే సమాచారం తీసుకుంటారు. 
    ఎ. అవును     బి. కాదు 

8.    అక్కడ స్థానికంగా ఉంటున్న ఒకరిద్దరి చిరునామాలు ముందుగానే తీసుకుని దగ్గర ఉంచుకుంటారు. 
    ఎ. అవును     బి. కాదు 

9.    దారిలో మీరు చూడదగ్గ ప్రదేశాల విషయంపై కూడా మీకు అవగాహన ఉంటుంది. 
    ఎ. అవును     బి. కాదు 

10.    భద్రత పరంగా టూర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు బాగా తెలుసు. ఆ మేరకు భద్రతచర్యలు తీసుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు 

‘ఎ’ లు ఏడు కంటే ఎక్కువ వస్తే టూర్‌ ప్లానింగ్‌లో మీరు పక్కాగా ఉంటారు. మీరు వెంట ఉంటే మీ వెంట వచ్చేవారికి సైతం బోల్డంత ఊరటగా ఉంటుంది.  ఒకవేళ ‘బి’ లు ఎక్కువగా వస్తే మీరు టూర్‌ ప్లానింగ్‌ గురించి పెద్దగా ఆలోచించరు. అప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి అప్పుడే ఆలోచించవచ్చు అని అనుకుంటారు. ఇలా ముందుగా ప్లాన్‌ చేసుకోకపోతే ప్రయాణంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. వాటిని వీలైనంతగా తగ్గించుకోడానికి ‘ఎ’లను సూచనలుగా తీసుకుని టూర్‌ ప్లాన్‌ చేయండి. 

మరిన్ని వార్తలు