మానవ మనుగడ మొక్కలోనే

5 Aug, 2018 00:43 IST|Sakshi

చెట్లు (అడవులు) అనంతమైన దైవకారుణ్యానికి, ఆయన మహత్తుకు తిరుగులేని నిదర్శనాలు. మన జీవితాలకు, అడవులకు అవినాభావ సంబంధం ఉంది. మానవ మనుగడ, సమస్త ప్రాణికోటి మనుగడ అడవుల సంరక్షణపైనే ఆధారపడి ఉంది. అడవుల్ని సంరక్షించుకోక పోతే ప్రకృతి అసమతౌల్యానికి గురవుతుంది. అల్లకల్లోలం ప్రారంభమవుతుంది. అతివృష్టి, అనావృష్టి సమస్యలు తలెత్తుతాయి.దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. భవిష్యత్తు అంధకారమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమాదఘంటిక ఇప్పటికే మోగింది. తక్షణంమేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ముహమ్మద్‌ ప్రవక్త వారు మొక్కల పెంపకం, అడవుల సంరక్షణ దిశగా ప్రజల్ని ఎంతగానో ప్రోత్సహించారు. చెట్లను నరకడం వల్ల జరిగే అనర్ధాలు, నష్టాలను గురించి ప్రజలను రకరకాలుగా హెచ్చరించారు. వాటిని సంరక్షించడంవల్ల ఒనగూడే ప్రయోజనాలను అత్యంత మనోహరంగా వివరించారు. చెట్టునాటడం అత్యుత్తమ దానం(సదఖా)అని ఆయన ప్రవచించారు. మొక్కలు నాటడం వల్ల మానవాళికి అనంతమైన లాభాలు, శుభశ్రేయాలు కలుగుతాయని చెప్పారు.
 

ఆయన స్వయంగా మదీనా లోని హజ్రత్‌ సల్మాన్‌ ఫార్శీ (ర) గారి తోటలో మొక్కలు నాటి చెట్ల పెంపకం ప్రాధాన్యతను జనావళికి చాటి చెప్పారు. వృక్షాలు మానవులకు జననం నుంచి, మరణం వరకు తోడూనీడగా ఉంటాయని, వాటిని నాశనం చేయడమంటే, మానవుడు స్వయంగా చేజేతులా వినాశనం కొని తెచ్చుకోవడమేనని ప్రవక్తమహనీయులు  బోధించారు. ఎవరైతే ఒక మొక్కను నాటి, అది పెరిగి పెద్దయ్యేవరకు దాన్ని సంరక్షిస్తారో, వారుచేసిన ఈ సత్కార్యానికి ప్రతిఫలంగా అల్లాహ్‌ స్వర్గంలో వారికోసం ఒక చెట్టును నాటుతాడని కూడా ఆయన సెలవిచ్చారు. స్వర్గంలో అందమైన వనాలు, మధురమైన పళ్ళు, ఫలాలు ఉంటాయన్న వర్ణనలు పవిత్రఖురాన్‌ లో అనేకంఉన్నాయి. కనుక మానవ మనుగడకు ఇతోథికంగా తోడ్పడుతున్న చెట్లను, వృ క్షసంపదను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా తాత్కాలిక ప్రయోజనాలకోసం వృక్షవిధ్వంసానికి పాల్పడుతూ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే భవిష్యత్తు అంధకారమౌతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్రిస్పర్‌తో అందరికీ సరిపోయే మూలకణం!

లక్ష కోట్ల మొక్కలతో భూతాపోన్నతికి చెక్‌! 

ఢ్రై ఫ్రూట్స్‌ తింటే  లావెక్కుతారా?

కాలేయం  సైజు  పెరిగింది... ఎందుకు? 

మన ఊరి కథలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సమ్మర్‌లో షురూ

అంతా ఉత్తుత్తిదే

కాంబినేషన్‌ కుదిరింది

వేలానికి  శ్రీదేవి  చీర 

కొత్త దర్శకుడితో?

హేమలతా లవణం