సహచరి

9 Aug, 2019 12:49 IST|Sakshi

చెట్టు నీడ

పూర్వం ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. దాంతో అక్కడ నివసించే ఎలీమెలెకు అనే అతడు తన భార్య నయోమి, ఇద్దరు కుమారులతో కలిసి పొరుగు దేశమైన మోయాబు దేశానికి వలస వెళ్లాడు. వారు ఆ దేశంలో ఉన్న కొంత కాలానికి నయోమి భర్త చనిపోయాడు. తర్వాత తన ఇద్దరు కుమారులైన మహ్లోను, కిల్యోనుకు మోయాబు దేశపు యువతులైన ఓర్పా, రూతులతో వివాహం చేసిందామె. కొంతకాలానికి నయోమి ఇద్దరు కుమారులు మరణించారు.

ఇలా అనేక బాధలు అనుభవిస్తున్న నయోమికి తన దేశమైన యూదా బెత్లెహేములో దేవుడు కరువు లేకుండా ఆహారాన్ని ప్రసాదించాడని తెలుసుకొని, ఇరువురి కోడళ్లను పిలిచి – మీరు మీ పుట్టింటికి వెళ్లి మరలా వివాహం చేసుకుని బిడ్డలతో సుఖసంతోషాలతో జీవించండని చెప్పింది.

అందుకు తన పెద్ద కోడలు ఓర్పా దుఃఖంతో తన అత్తను ముద్దుపెట్టుకొని తిరిగి తన స్వజనుల వద్దకు వెళ్లిపోయింది. తన రెండవ కోడలు రూతు మాత్రం తన అత్తను హత్తుకొని ‘‘నా వెంబడి రావద్దని, నన్ను విడిచి పెట్టుమనీ నన్ను బతిమాలుకొనవద్దు. నీవు  ళ్లే చోటికే నేనూ వస్తాను, నీవు నివసించు చోటే నేనూ ఉంటాను. నీ జనమే నా జనం. నీ దేవుడే నా దేవుడు... మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక’’ (రూతు 1:16–17) అని తన దేశాన్ని, స్వజనులను విడిచి తన అత్తతో కలిసి వెళ్లింది.నయోమి వంటి మంచి మనస్తత్వం గల అత్తలు ఎందరుంటారు? సహచరులుగా వుంటూ మాట తప్పేవారు ఉన్న రోజుల్లో ‘సహచరి’ అంటే ఇలాంటి వారని నిరూపించిన రూతు వంటి ఉత్తమ స్త్రీలు ఎందరుంటారు? రూతు అంత మంచి మనస్తత్వం గలది కాబట్టే ఏసు తన పుట్టుకకు ఆమె వంశాన్నే ఎంచుకున్నారు.–  బి.బి.చంద్రపాల్‌ కోట

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లా అండ్‌ లాలన

నా భార్యపై అత్యాచారం చేశా...అరెస్ట్‌ చేయండి

ఒంటరిగా భోజనం..ఊహించని అతిధి

బాబు ఇంకా పక్క తడుపుతున్నాడు

వయసు మీద పడితే?

మొక్కజొన్న బాల్యం

మేలు కోరితే మంచి జరుగుతుంది

హిట్‌ సినిమాల రూపకర్త..

అమ్మా... నాన్నా... ఓ పారిపోయిన అమ్మాయి

జావా నుంచి హైదరాబాద్‌కి...

పాదాలు పదిలంగా

చీమంత పాఠం

ఆమెలా మారి అతడిలా మారిన వ్యక్తిని పెళ్లాడింది

అపారం రైతుల జ్ఞానం!

ముదిమిలోనూ ఆదర్శ సేద్యం

డెయిరీ పెట్టుకోవటం ఎలా?

‘అక్షయ్‌కి అసలు ఆడవాళ్ల మధ్య ఏం పని?’

రుతురాగాల బంటీ

ఖండాంతర పరుగులు

'ఉన్నావ్‌' నువ్వు తోడుగా

హేట్సాఫ్‌ టు సాక్షి

లేడీస్‌ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు...

మాట్లాడితే రూపాయి నోట్ల దండలు

చిన్న జీవితంలోని పరిపూర్ణత

ఇక్కడ అందం అమ్మబడును

లోకమంతా స్నేహమంత్ర !

స్తూపిక... జ్ఞాన సూచిక

దేవుడే సర్వం స్వాస్థ్యం

కారుణ్యం కురిసే కాలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. శ్రీముఖికి షాక్!

మేజర్‌ అజయ్‌ కృష్ణారెడ్డి రిపోర్టింగ్‌..

దాని నుంచి బయట పడడానికి ఆయుర్వేద చికిత్స..

అజిత్‌ అభిమాని ఆత్మహత్యాయత్నం

జీవీకి ఉత్తమ నటుడు అవార్డు

నవ్వు.. భయం...