పూసలతో హ్యాంగింగ్స్‌

29 Jun, 2018 01:44 IST|Sakshi

మోడ్రన్‌ డ్రెస్సుల మీదకు ఫ్యాషన్‌ జువెల్రీలో ఎన్ని మోడల్స్‌ ఉన్నా సరిపోవు. కొన్ని రకాల ఇయర్‌ హ్యాంగింగ్స్‌తోనూ లుక్‌లో గొప్ప మార్పు తీసుకురావచ్చు. ఈ ముచ్చటైన ఇయర్‌ హ్యాంగింగ్స్‌ మీరే డిజైన్‌ చేసుకోవచ్చు.


నచ్చినవి మూడు రకాల పూసలు (పొడవు పూసలకు రెండువైపులా రంధ్రాలు ఉంటాయి)
హుక్‌కి కావల్సిన తీగ లేదా హుక్స్‌ విడిగానూ లభిస్తాయి.
 ప్లాస్టిక్‌ వైర్‌

తయారీ:
1.     పొడవు పూసలను వైర్‌తో ఇలా గుండ్రటి షేప్‌ వచ్చేలా గుచ్చాలి.
2.     చిన్న గోల్డ్‌ బాల్స్‌ని చివరలో, మధ్యలో పెద్ద తెల్లని పూస వచ్చేలా వైర్‌తో గుచ్చి సెట్‌ చేసుకోవాలి.
3.    పూసలన్నీ ఇలా ఒక షేప్‌ వచ్చేలా గుచ్చాలి.
4.    హ్యాంగింగ్‌ పూసను తెల్లటి పూసల వూర్‌కి అటాచ్‌ చేస్తూ హుక్‌తో జత చేయాలి.
5.    గోల్డ్‌ కలర్‌ పూసలను చివరలను కలపుతూ గుచ్చాలి.
6.    పై భాగంలో హుక్‌ లేదా సన్నని గోల్డ్‌ కలర్‌ తీగను తగిలించి, పట్టుకారతో సెట్‌ చేయాలి.
7.     బొమ్మలు చూపిన విధంగా రెండు హ్యాంగింగ్స్‌ను ఇలా తయారుచేసుకోవాలి.

మరిన్ని వార్తలు