హైడ్రోజన్‌ కార్లు... ఇంకో అడుగు దగ్గరగా..

22 Nov, 2017 23:46 IST|Sakshi

పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్‌తో కూడా కొద్దోగొప్పో కాలుష్యం సమస్య ఉంటుందేమోగానీ.. హైడ్రోజన్‌తో మాత్రం అస్సలు ఉండదు. ఈ విషయం చాలాకాలంగా తెలుసుగానీ.. ఈ వాయువును చౌకగా ఉత్పత్తి చేయడంతోపాటు, సురక్షితంగా నిల్వ చేయడం, సరఫరా చేయడంలో సమస్యలు ఉండటం వల్ల అవి ఇప్పటివరకూ పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా (లాస్‌ఏంజిలెస్‌) శాస్త్రవేత్తలు నికెల్, ఐరన్, కోబాల్ట్‌లతో హైడ్రోజన్‌ను చౌకగా ఉత్పత్తి చేసేందుకు ఓ వినూత్న పరికరాన్ని తయారు చేశారు.

దీనిద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల్లో అక్కడికక్కడే విద్యుత్తు తయారు చేసుకునే అవకాశమేర్పడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రిచర్డ్‌ కానెర్‌ తెలిపారు. సాధారణ హైడ్రోజన్‌ ఫ్యుయల్‌సెల్స్, సూపర్‌ కెపాసిటర్లలో రెండు ఎలక్ట్రోడ్‌లు ఉంటే.. వీరు తయారు చేసిన పరికరంలో మూడు ఎలక్ట్రోడ్‌లు ఉంటాయి. వీటిల్లో ఒకటి సూపర్‌ కెపాసిటర్‌గా విద్యుత్తును నిల్వ చేసుకుంటుంది. అదేసమయంలో నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌లుగా విడగొడుతుంది. 

మరిన్ని వార్తలు