నాదే పొరపాటు!

22 Apr, 2014 22:56 IST|Sakshi
నాదే పొరపాటు!

 వేదిక
మొన్నీమధ్యే నాకో పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఉద్యోగం కూడా మంచిది. పెళ్లి చూపులయ్యాక ఇంటికెళ్లి ఫోన్ చేస్తామన్నారు. సంబంధం తెచ్చినాయనకు ఫోన్ చేసి అమ్మాయి వయసు కొంచెం ఎక్కువున్నట్లుంది అన్నారట. అంతే - ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. విషయం తెలిసిన దగ్గర నుంచి అమ్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది.
 
 '‘ఆరోజు నీకు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. అంతా నా ఖర్మ’’ అంటూ అమ్మ నన్ను తిట్టనిరోజు లేదు. మొదట్లో అమ్మ మాటల్ని లెక్కచేసేదాన్ని కాదు. ఇప్పుడు నాకు కూడా భయం మొదలైంది. అమ్మ మాటలకు బాధేస్తోంది. అది గమనించిన అమ్మ తిట్టడం మానేసి తనలో తానే బాధపడడం మొదలెట్టింది. నేను చేసిన పొరపాటు ఏమిటంటే - నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి బాగున్నాడు. ఐదంకెల జీతం. అంతా బాగుంది. ‘‘ఇప్పుడే కదా ఉద్యోగంలో చేరాను. ఓ ఏడాది వరకూ పెళ్లి మాట ఎత్తకండి’’ అని అమ్మకూ, నాన్నకూ గట్టిగా చెప్పాను. నాన్న వెంటనే ఒప్పుకున్నారు.
 
అమ్మ మాత్రం నన్ను ఒప్పించడానికి చాలా ప్రయత్నించింది. నేను ససేమిరా అన్నాను. ఏడాది తర్వాత వచ్చిన సంబంధాల్లో కొన్ని నాకు నచ్చలేదు. కొన్ని నాన్నకు నచ్చలేదు. అలా చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నా వయసు ముప్ఫైకి దగ్గరపడుతోంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరూ ‘అమ్మాయికి వయసెక్కువ’ అంటున్నారు. ఆ మధ్య వచ్చిన ఒక సంబంధం వారికి నేను బాగా నచ్చాను. కానీ, అబ్బాయి వయసు నలభై వరకు ఉంటాయి.
 
 దాంతో, ఆ సంబంధం వదులుకున్నాం. ‘‘ఎంచక్కా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండేది’’ అంటూ అందరి దగ్గరా అంటోంది మా అమ్మ. ఇప్పుడు నాకు కూడా నిజమేననిపిస్తోంది. నా నిర్ణయం కారణంగా అమ్మానాన్నలు కూడా ఇబ్బందిపడుతున్నారు. ఈ ‘వేదిక’ ద్వారా అమ్మాయిలకు నేను చెప్పేదేమిటంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట వినకపోతే చాలా నష్టపోతాం.     
 - శ్రీలత, హైదరాబాద్

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హలో... మీ అమ్మాయి నా దగ్గరుంది

రియల్‌ లైఫ్‌ లేడీ సింగం

కోటల కంటే ఇల్లే కష్టం

గర్భవతులకు నడక మంచి వ్యాయామం!

ఇక ద్రవాలూ అయస్కాంతాలే!

కీళ్ల కదలికలతోనూ విద్యుత్తు...

అమ్మాయికి మొటిమలు వస్తున్నాయి..?

వెనిస్‌ వాకిట్లో బాంబే రోజ్‌

కొత్త గర్ల్‌ ఫ్రెండ్‌... కొత్త బాయ్‌ఫ్రెండ్‌

‘జంకు’.. గొంకూ వద్దు!

హాహా హూహూ ఎవరో తెలుసా?

కడుపులో కందిరీగలున్న  స్త్రీలు

ఖాళీ చేసిన మూల

మెరిసే చర్మం కోసం..

బరువును సులువుగా తగ్గించే చనాచాట్‌

రుచుల్లో "మున"గండి...

కొవ్వుకణాలతో కేన్సర్‌కు మందులు

సింగపూర్‌లో శాకాహార హోటల్‌

సరయు : డాన్స్‌, ఫైట్స్‌, ఆర్ట్స్‌

హాలీవుడ్‌కి రష్యన్‌ పేరడీ!

శిక్ష ‘ఆటో’మాటిక్‌

మహిళా ఉద్యోగులకు డ్రెస్‌ కోడ్‌పై దుమారం

గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!

దోమల నిర్మూలనకు కొత్త మార్గం

హార్ట్‌ ఎటాక్‌ లాంటిదే ఈ ‘లెగ్‌’ అటాక్‌!

మేబీ అది ప్రేమేనేమో!

నో యాక్టింగ్‌ పండూ..

మల్టీ విటమిన్స్ పనితీరుపై సంచలన సర్వే

గుండె గాయం మాన్పేందుకు కొత్త పరికరం!

పుష్టిని పెంచే సూక్ష్మజీవులు...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!

రొమాంటిక్‌ మూడ్‌లో ‘సాహో’