మొటిమలు మాయం కావాలంటే

3 Nov, 2015 23:14 IST|Sakshi
మొటిమలు మాయం కావాలంటే

కొన్ని తమలపాకులను మెత్తగా దంచి పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మొటిమలు మటుమాయం.ముఖంపై నల్లమచ్చలు తొలగిపోవడానికి తేయాకు తైలం బాగా పని చేస్తుంది. అందుకు రెండు టీస్పూన్ల టీ పొడిని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టాలి.

ఉదయమే ఆ నానిన ఆకులతో నల్లమచ్చలపై ఓ నిమిషం పాటు రుద్దాలి. తర్వాత ఆ పాలతో ముఖాన్ని కడుక్కుంటే మచ్చలు పోతాయి.మోచేతులు, మోకాళ్లు నల్లగా గరుగ్గా ఉండటం సహజం. ఆ నల్లటి మరకలను పోగొట్టుకునేందుకు అనాస పండు గుజ్జును వాటిపై అప్లై చేయండి. అయిదు నిమిషాల తర్వాత అదే గుజ్జుతో మర్దన చేసి చల్లటి నీటితో కడిగేసుకోండి.
 
 

మరిన్ని వార్తలు