న న్నడగొద్దు ప్లీజ్‌

25 May, 2017 03:08 IST|Sakshi
న న్నడగొద్దు ప్లీజ్‌

నమస్తే సార్‌! నేను డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాను. నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి మోసపోయాను. తనకు పెళ్లి కూడా అయిపోయింది. అయినా మరచిపోలేకపోతున్నాను! తను ఇక రాదని, బాధపడ్డా ప్రయోజనం లేదని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. కానీ, కొన్ని రోజులగా ఏదో ఎక్స్‌ప్రెస్‌ చెయ్యలేని బాధ నన్ను వెంటాడుతోంది! తనతో నాకు ముడిపడ్డ జ్ఞాపకాలే ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయని నాకు అర్థమయ్యింది. దయచేసిన నాకు మంచి సలహా ఇవ్వండి. ప్లీజ్‌ సార్‌! – రాజు

రాజు నీ విషయం చదివాక వెటకారంగా సమాధానం ఇవ్వాలనిపించడం లేదు. అమ్మాయిని ప్రేమించావు. పరిస్థితుల వల్ల తన పెళ్లి జరిగిపోయింది.నువ్వు అమ్మాయిని టెన్షన్‌ పెట్టకుండా గుడ్‌ బాయ్‌లాగా ఉన్నావు. ప్రేమించిన వాళ్లు దూరమయితే చాలా బాధగా ఉంటుంది.

నువ్వు అదృష్టవంతుడివి.. నీకు అందమైన జ్ఞాపకాలు దగ్గరగా ఉన్నాయి.వాటిని మూట కట్టుకుని ముందుకు సాగిపో. ‘అవేమైనా అరటిపండ్లా సార్‌.. మూట కట్టుకోవడానికి?’ అని అడిగింది నీలాంబరి.ఇది మింగే మూట కాదు దాచుకునే మూట.‘అస్సలు ఓపెన్‌ చెయ్యకూడదా సార్‌?’మళ్లీ జీవితంలో ఇంకోమూట దొరుకుద్ది! ఇంతకంటే అందమైన మూట! అప్పుడు దీన్ని దించేసి... దాన్ని ఎగేసుకుని ఎంజాయ్‌ చెయ్యాలి!అచ్ఛా బహుత్‌ అచ్ఛా! కొంచెం పిలాసఫీ కంపు కొడుతోంది కానీ... రాజుకి కరెక్ట్‌!’ అంటూ అరటిపండు అందించింది నీలాంబరి.
 ప్రియదర్శిని రామ్‌,లవ్‌ డాక్టర్‌

మరిన్ని వార్తలు