హెల్త్‌ టిప్స్‌

3 Mar, 2019 00:59 IST|Sakshi

►పంటినొప్పి ఉన్నప్పుడు వెల్లుల్లి రేకను చిదిమి అందులో రాతి ఉప్పును ఉంచి నొప్పి ఉన్నచోట పెట్టాలి. కొంతసేపటికి నొప్పి తగ్గుతుంది. రోజూ ఉదయం ఒకటి – రెండు వెల్లుల్లి రేకలను నమిలి తింటే పంటినొప్పి రాదు, దంతాలు ఆరోగ్యంగా, పటిష్టంగా ఉంటాయి.

►ఉల్లిపాయను నలగ్గొట్టి నొప్పి ఉన్న చోట పెట్టాలి. పిప్పిపన్ను ఉంటే ఇలా ప్రతిరోజూ పెడుతుంటే క్రమేపీ బ్యాక్టీరియా నశిస్తుంది. ప్రతిరోజూ రెండు – మూడు నిమిషాల పాటు పచ్చి ఉల్లిపాయ ముక్కను నమిలితే పంటికి, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు రావు.

►నిమ్మరసంతో చిగుళ్లను, పళ్లను వేలితో రుద్దాలి. ఇలా చేస్తుంటే పళ్లు వదులయ్యే సమస్య రాదు. చిగుళ్ల నుంచి రక్తం కారడం  తగ్గుతుంది. పంటిగార ఉంటే అది తగ్గే వరకు రోజూ ఐదు నిమిషాలపాటు నిమ్మరసంతో కాని రసం పిండేసిన తొక్కతో కాని రుద్దాలి. 

మరిన్ని వార్తలు