సంతోషం మీ సొంతమా?

2 May, 2018 00:19 IST|Sakshi

సెల్ఫ్‌ చెక్‌

‘సంతోషం ఎక్కడో కాదు, మనలోనే ఉంటుంది’ అని తత్వవేత్తల నుంచి ఆధ్యాత్మిక గురువుల వరకు చెబుతుంటారు. సంతోషాన్ని ఆస్వాదించగల నేర్పు ఉంటే చాలు. మనలో ఆ నేర్పు ఉందా?

1.    మీకు ఎదురైన ప్రతి అంశంలోనూ పాజిటివ్‌ కోణాన్ని మాత్రమే రిసీవ్‌ చేసుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు 

2.    మీకు ఎదురైన సమస్యలో ఇమిడి ఉన్న ప్రతిబంధకాలను కాకుండా దానికి పరిష్కారమార్గాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

3.    ప్రతిరోజూ మనసారా నవ్వగలిగే కామెడీ షోలు, తమాషా సన్నివేశాలకు కొంత సమయాన్ని కేటాయిస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

4.    న్యూస్‌పేపర్‌లో కాని మంచిపుస్తకాల నుంచి కాని స్ఫూర్తిదాయకమైన రచనలను కనీసం కొద్దిపేజీలైనా సరే ప్రతిరోజూ చదువుతారు.
    ఎ. అవును     బి. కాదు 

5.    అప్పుడప్పుడూ మీ ఆలోచనలు ఎలా సాగుతున్నాయని ఆత్మపరిశీలన చేసుకుంటుంటారు. 
    ఎ. అవును     బి. కాదు 

6.    బస్సులో ఇబ్బంది పడుతున్న వారి కోసం మీ సీటునివ్వడంలాంటిచిన్నదైనా సరే... రోజుకు ఒకటైనా ఇతరులకు ఉపయోగపడే పని చేసి తృప్తిపడుతుంటారు.
    ఎ. అవును     బి. కాదు 

7.    ప్రతిరోజూ మీకు సంతోషం కలిగించే ఒక చిన్న పనినైనా చేసుకుంటారు. ఇష్టమైనది తినడం, చదవడం, బీచ్‌లో షికారుకెళ్లడం, టీవీలో ఇష్టమైన ప్రోగ్రామ్‌ చూడడం వంటి చిన్న పనుల్లో దొరికే సంతోషం అనంతం.
    ఎ. అవును     బి. కాదు 

8.    ఎవరైనా సంతోషంగా ఉన్నా, మీకు లేనివి వారికి ఉన్నా ఈర్ష్యపడడం అనేది తెలియకుండా జరిగిపోతోంది.
    ఎ. కాదు     బి. అవును 

9.    మీ ఫ్రెండ్స్‌ మనసు బాగాలేనప్పుడు మీతో కలిసి కబుర్లు చెబుతూ సాంత్వన పొందాలనుకుంటారు.
    ఎ. అవును     బి. కాదు 

మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు సంతోషం కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేదు, దానిని నిండుగా ఆస్వాదిస్తున్నారు. ‘బి’లు ఎక్కువైతే సంతోషంగా జీవించడానికి మీ చుట్టూ ఉన్న ఏ అంశాన్నీ మీరు వినియోగించుకోవడంలేదనుకోవాలి. 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా