నమ్మే ధైర్యం మీకుందా?

15 Dec, 2016 23:06 IST|Sakshi
నమ్మే ధైర్యం మీకుందా?

ఘోస్ట్‌

దెయ్యాల గురించి  మాట్లాడుకునే ధైర్యం
భయస్థులకు మాత్రమే ఉంటుంది! సో... భయం అన్నది ధైర్యవంతుల క్వాలిటీ.
ఇంతకీ  దెయ్యాలన గుర్తించడం ఎలా?  మీ చుట్టుపక్కల దెయ్యం తిరుగుతోందని కనిపెట్టడం ఎలా? కొన్ని హింట్స్‌.


మీరున్న చోట హఠాత్తుగా టెంపరేచర్‌ డౌన్‌ అయితే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో తాకినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

అకారణంగా మీ చర్మంపై వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

మీరు పెట్టని చోట పెట్టని వస్తువు కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

  మీ కంటి చివర్ల నుంచి నీడలేవో కదలినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

మీ కనుచూపు మేరలో ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎవరో పేరు పెట్టి పిలిచినట్లు అనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

బల్బులు వాటంతటవి వెలిగితే, ఫ్యాన్లు వాటంతటవి తిరగితే, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు వాటంతటవి పనిచేయడం మొదలుపెడితే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఎవరో మెట్లు ఎక్కుతున్న లేదా దిగుతున్న చప్పుడు గానీ వినిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

గోడలపై, గ్లాసులపై అంతుచిక్కని (మానవాతీత) చేతి గుర్తులు కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

మీ వెనుక ఎవరూ లేకున్నా, మీరు అద్దం చూసుకుంటున్నప్పుడు అద్దంలో వేరెవరో కనిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

ఇరుకైన గోడల నడుమ ఎవరో నడుస్తున్నట్లు చప్పుడు వినిపిస్తే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

మీకు మాత్రమే వినిపించేలా ఎవరైనా పెద్దగా ఏడుస్తుంటే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

ఏదో చెప్పలేని వాసన.. అది మంచిదైనా, చెడ్డదైనా ముక్కు పుటాలకు తాకితే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

మీ పిల్లి గానీ, కుక్క గానీ అకారణంగా ఒకేవైపు చూస్తూ, బెదురుముఖం పెట్టి అలా నిలబడిపోతే అక్కడ దెయ్యం ఉన్నట్లే.

ఇవన్నీ... వదిలెయ్యండి. ఇప్పుటికిప్పుడు మీరు దెయ్యాన్ని చూడాలనుకుంటున్నారా? ఓసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి.
చూసుకున్నారా? దెయ్యం కనిపించలేదా?! అయితే... మీరు చూశారని చెప్పి దెయ్యం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయి ఉంటుంది.
(సరదాగా రాసిన ఐటమ్‌ ఇది. చప్పుడు చెయ్యకుండా పక్కవాళ్లకివ్వండి)
 

మరిన్ని వార్తలు