విజయానికి దారి ఇది...

17 Apr, 2014 01:32 IST|Sakshi
విజయానికి దారి ఇది...

 - దీపక్ రవీంద్రన్, సియివో, ఇన్‌నోజ్ టెక్నాలజీస్
ఒక ఐడియా రావడం కంటే దాన్ని వాస్తవంలోకి తీసుకురావడం అనేది గొప్ప విషయం. సంకల్పబలం, పని మీద ప్రేమ ఉంటే అదేమీ అసాధ్యమైన విషయం కాదు.స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలిరోజుల్లో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నాను. అయితే వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితంలో అవి నాకు పాఠాలుగా నిలిచాయి.తల్లిదండ్రుల మద్దతు ఉండాలి. మనం చేయబోయే పని గురించి వాళ్లకు స్పష్టంగా చెప్పాలి. సలహాలు, సూచనలు తీసుకోవాలి.

 ఉద్యోగం చేసుకోక ఏమిటీ ప్రయోగాలు? అనవచ్చు. కాని ఏదో ఒకరోజు మనం తీసుకున్న నిర్ణయం మంచిదని వారు గ్రహిస్తారు.వ్యాపార భాగస్వాములను ఎంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరులే అని సర్దుకుపోకుండా... అన్ని రకాలుగా ఆలోచించి భాగస్వాములను ఎంచుకోవాలి.పని ఎంత ముఖ్యమో, ఆ పనికి ప్రచారం కూడా అంతే ముఖ్యం. మీడియా వల్ల మన విజయాల రేటు పెరుగుతుంది.మనం నమ్ముకునేదాని మీద గట్టిగా నిలబడితే మనం వెళ్లేదారిలో అడ్డంకులు ఏవీ ఏర్పడవు.

మరిన్ని వార్తలు