ఊహించని వరం దక్కింది

8 Jul, 2017 01:52 IST|Sakshi
ప్రొద్దుటూరు మునిసిపల్‌ కార్యాలయంలో శశికళ

నా పేరు సాంట శశికళ. మాది కడపజిల్లా అట్లూరు మండలం కొరికుంట గ్రామం. మా నాన్న వెంకట సుబ్బారెడ్డికి రెండు ఎకరాల భూమి ఉంది. పండించే పంటతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. నా పదో తరగతి పూర్తయ్యాక అంతకు మించి చదివించే శక్తి లేక చదువు మానేసే పరిస్థితి ఉండేది. నాకేమో చదువు ఇష్టం. ఎలాగైనా బాగా చదువుకోవాలని కోరుకునేదాన్ని. ఆ సమయంలోనే వై.ఎస్‌.గారు దేవుడిలా నాకు కనిపించారు. ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటి ఏర్పాటు చేయడంతో నాకు సీటు వచ్చింది.

ఇంటర్‌ నుంచి బి.టెక్‌ వరకు అక్కడే ఉచితంగా చదువుకునే వరం వై.ఎస్‌గారి దయ వల్ల వచ్చింది. ఆ చదువు బయట చదివితే ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల వరకూ ఖర్చయ్యేది. అదంతా లేకుండా నేను బి.టెక్‌ పూర్తి చేశారు. అది పూర్తవుతూనే ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జీఈఏగా నియామకం పొందాను. నా బ్యాచ్‌లో ఇలా ఉద్యోగాలు పొందినవారు ఎందరో ఉన్నారు. మేమంతా వై.ఎస్‌.గారి రుణం ఎలా తీర్చుకోగలం?
– శశికళ, పొద్దుటూరు

మరిన్ని వార్తలు