అడిగానని శిక్షించరు కదా!

17 Aug, 2019 07:26 IST|Sakshi
ఇల్తిజా

జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా.. కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాకు ఒక లేఖ రాశారు. తననెందుకు గృహనిర్బంధంలో ఉంచారో వివరించాలని ఆమె ఆ లేఖలో కోరారు. ‘‘దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది. కశ్మీరీలు మాత్రం కనీస మానవ హక్కులు కూడా లేకుండా బోనులోని జంతువుల్లా ఉండిపోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా ప్రాథమిక హక్కుల గురించి ఇలా ప్రశ్నల్ని లేవనెత్తినందుకు నన్ను శిక్షించవద్దనీ, నాపై నేరం మోపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను’’ అని ఆ లేఖను ముగించారు ఇల్తిజా. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి ముందు రోజు  అక్కడి కొన్ని ప్రధాన రాజకీయ కుటుంబాల వారిని ఇల్లు కదలకుండా చేసింది ప్రభుత్వం. వారిలో మెహబూబా ముఫ్తీ కూడా ఒకరు. మెహబూబాకు ఇద్దరు కూతుళ్లు. అమిత్‌షాకు ఇప్పుడీ ఉత్తరం రాసిన ఇల్తిజా ఒకరు. ఇర్తికా ఇంకొకరు.

మరిన్ని వార్తలు