అపురూపం

11 Nov, 2018 01:21 IST|Sakshi

సాధారణంగా ఇళ్లలో నల్లని సాలగ్రామాలనే పూజిస్తుంటారు. ఎరుపు తప్ప మిగిలిన రంగుల్లో ఉన్న సాలగ్రామాలను ఇళ్లలో పూజించవచ్చు. ఎరుపు రంగులో ఉండే సాలగ్రామాలను ఆలయాలు, మఠాల్లో మాత్రమే పూజించాలి. పరిమాణంలో చిన్నవిగా, మధ్యస్థంగా ఉండే వాటినే ఇళ్లలో పూజించాలి. అసాధారణ పరిమాణాల్లో ఉండే వాటిని ఆలయాల్లో మాత్రమే పూజించాలి. సాలగ్రామాలను పూజించేటప్పుడు ధూప దీప నైవేద్యాలతో పాటు తప్పనిసరిగా తులసిదళాలను సమర్పించాలి.

కనీసం ఒక్క తులసిదళమైనా సరిపోతుంది. సాలగ్రామాలను ప్రతిరోజూ అభిషేకించాలి. అభిషేకానికి మంచినీరు, ఆవుపాలు, పంచామృతాలలో ఏదైనా ఉపయోగించవచ్చు. ఇళ్లలోని పూజమందిరాల్లో రెండు, నాలుగు... ఇలా నూట ఎనిమిది ఇంకా ఆపై ఎన్నైనా శక్తిమేరకు పూజమందిరంలో ఉంచి పూజించుకోవచ్చు. సాలగ్రామాలను పూజించే వారు నియమబద్ధమైన జీవనం కొనసాగించాలి. సాలగ్రామాల పూజ ఇహపర సౌఖ్యాలను అనుగ్రహిస్తుంది.

మరిన్ని వార్తలు