కీళ్లనొప్పులకు మెరుగైన చికిత్స!

9 Feb, 2018 23:55 IST|Sakshi
కీళ్లనొప్పు,లు

కీళ్లనొప్పులకు మరింత మెరుగైన చికిత్స కల్పించే లక్ష్యంతో యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కీళ్లలోనే సరికొత్త మృదుకణజాలాన్ని వృద్ధి చేయగల సరికొత్త మందును వీరు కనుక్కోగలిగారు. ఆర్‌సీజీడీ 423 అని పిలుస్తున్న ఈ సరికొత్త రసాయనాన్ని ఇంజెక్షన్‌ రూపంలో కీళ్లల్లోకి ఎక్కించుకుంటే చాలు.. ఆ ప్రాంతంలో వాపు/మంట తగ్గడమే కాకుండా కొంతకాలానికి అరిగిపోయిన కణజాలం స్థానంలో కొత్త కణజాలం పుట్టుకొస్తుంది.

శరీరంలోని గ్లైకోప్రోటీన్‌ 130ను ప్రభావితం చేయడం ద్వారా ఇది పనిచేస్తుందని... కణజాలాన్ని అభివృద్ధి చేయాలన్న సందేశాన్ని చేరవేస్తుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎవ్‌సీన్‌కో  చెప్పారు. పరిశోధనశాలలో చేసిన ప్రయోగాల్లో ఆర్‌సీజీడీ 423ని ఉపయోగించినప్పుడు కీళ్లలోని కణాలు వేగంగా ఎదగడంతోపాటు.. మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, కణజాలం అరిగిపోయిన ఎలుకల్లోకి దీన్ని జొప్పించినప్పడు తక్కువ సమయంలనే సమస్య మాయమైపోయిందని తెలిపారు. ఎముకలు గుల్లబారే సమస్యతోపాటు చిన్న వయస్కుల్లో కనిపించే కీళ్లనొప్పులకూ ఈ కొత్త మందును ప్రయోగించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.  

మరిన్ని వార్తలు