వీక్షణం

20 Jul, 2014 22:39 IST|Sakshi
వీక్షణం

 చైనాలో ఓ రహదారిని నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అడ్డుగా ఉన్న నిర్మాణాలను పడగొట్టి, యజమానులందరికీ వేరేచోట స్థలాలు ఇప్పించారు. కానీ ఓ ఇద్దరు దంపతులు మాత్రం తమ ఇంటిని కూలగొట్టడానికి ఒప్పుకోలేదు. వారిని బతిమాలి విసిగిపోయిన అధికారులు ఇంటిని పడగొట్టడం మొదలు పెట్టారు. అయినా కూడా బయటకు వచ్చేది లేదని వాళ్లు మొరాయించడంతో చివరికి ఆ ఇంటిని అలాగే ఉంచి రోడ్డు వేసేశారు. ఇప్పుడా ఇల్లు సరిగ్గా దారి మధ్యలో ఉంది!
 
 ‘హ్యారీపాటర్’లో రాన్ వెస్లీగా నటించిన రూపర్ట్ గ్రింట్ చాలా పాపులర్ అయ్యాడు. బాగా సంపాదించాడు కూడా. అయితే అతగాడికి చిన్నప్పుడు ఐస్‌క్రీములమ్మాలనే కోరిక ఉండేదట. దాన్ని తీర్చుకోవడానికి ఓ వ్యాన్ కొనుక్కుని, అందులో ఐస్‌క్రీములు పెట్టుకుని ఊరూ వాడా తిరగడం మొదలెట్టాడు. అయితే అమ్మడంలేదులెండి... పంచుతున్నాడంతే!
 
 జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక పెంగ్విన్‌ని పెంచుకుంటున్నాడు. దాని పేరు లాలా. ఇది ఇంట్లో ఎన్ని పనులు చేస్తుందో తెలుసా? రోజూ ఒక బ్యాగ్‌ని వీపునకు తగిలించుకుని వెళ్లి, పక్క వీధిలో ఉన్న మార్కెట్‌లో చేపలు కూడా కొనుక్కొస్తుంది. దాని యజమాని ఆ బ్యాగ్‌లో డబ్బులు వేసి పంపిస్తాడట. చేపలు బ్యాగ్‌లో వేశాక, ఆ డబ్బిచ్చి వీటిని ఇంటికి తీసుకొస్తుందట లాలా!
 

మరిన్ని వార్తలు