సాహిత్య మరమరాలు

18 Nov, 2019 00:37 IST|Sakshi

పూర్వం రచయితలు మరో రచయితకి తమ రచనల్ని కూర్చోపెట్టి మరీ వినిపించే ధోరణి బాగా చలామణిలో ఉండేది.ఒకసారి మల్లాది రామకృష్ణశాస్త్రి దగ్గరకొక కథా రచయిత బొత్తెడు కథలు పట్టుకువెళ్లి, తొలుత ఒకటి వినిపించాడు. శాస్త్రిగారు విన్నారు. రెండో రచన రచయిత తీయబోతుంటే మరి తట్టుకోలేక ఇలా అన్నారు: ‘‘మీరు వినిపించిన కథతో మనస్సు నిండిపోయింది. ఈ రోజుకీ అనుభూతి ఇలా మిగిలి పోనివ్వండి.’’
(సౌజన్యం: ఇంద్రగంటి శ్రీకాంతశర్మ సమాలోచన)

మరిన్ని వార్తలు