నాకు సంతానయోగం ఉందా?

20 Jun, 2019 07:59 IST|Sakshi

నా వయసు 34 ఏళ్లు. వివాహమై పదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్‌ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? 
– ఎల్‌. సరస్వతి, కందుకూరు 
ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. 
స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు:
జన్యుసంబంధిత లోపాలు
థైరాయిడ్‌ సమస్యలు                  
అండాశయంలో లోపాలు
నీటిబుడగలు
గర్భాశయంలో సమస్యలు
ఫెలోపియన్‌ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు
డయాబెటిస్‌
గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. 

పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు
హార్మోన్‌ సంబంధిత సమస్యలు
థైరాయిడ్‌
పొగతాగడం
శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం 

సంతానలేమిలో రకాలు:
ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ 

ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్‌ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. 
సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ : మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్‌ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్‌ రావడం వల్ల సంభవిస్తుంది. 

గుర్తించడం ఎలా : తగిన వైద్య పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్‌ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్‌ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. 
చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్‌ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. 

>
మరిన్ని వార్తలు