దివ్య దరహాసం

26 Jan, 2017 23:07 IST|Sakshi
దివ్య దరహాసం

క్యాలెండర్‌

అడ్డంకులకు కుంగిపోతే బతుకింతే అని ఆగిపోతే జీవితానికి అర్థం లేదు! పోరాడాలి... తిరగబడాలి.. పైపైకి ఎగరాలన్న కాంక్షను కిందకు లాగుతున్న అడ్డంకులను నువ్వెంత అని ప్రశ్నించాలి. ఈ స్ఫూర్తికి నిలువెత్తు తార్కాణాలు వీరే! అందరూ దివ్యాంగులే. కాని ఎవరికీ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

ఒకరు బ్లేడ్‌ రన్నర్‌.. ఇంకొకరు స్పీడ్‌ రేసర్‌... ఇంకొకరు ఒలింపిక్‌ మెడల్‌ విన్నర్‌! సూపర్‌ మోడల్‌ ఒకరైతే షటిల్‌లో సైనా, సింధూలకు పోటీనిచ్చే షట్లర్‌ ఇంకొకరు! ‘లివింగ్‌ స్మైల్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ దేశ 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకదగ్గరకు చేర్చింది. ఏడాది మొత్తం స్ఫూర్తినింపే కేలండర్‌గా గుదిగుచ్చింది...  – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌



కిరణ్‌ కనోజియా
మొట్టమొదటి భారత మహిళా బ్లేడ్‌ రన్నర్‌ / ఐ.టి. ప్రొఫెషనల్‌



మానసి జోషి
  ప్రపంచ నెం.3 పారాలింపిక్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ (సింగిల్, మిక్స్‌డ్‌ డబుల్స్‌)



వినోద్‌ రావత్‌
  బైకర్, యాక్టర్, మారథాన్‌ రన్నర్‌


షాలిని సరస్వతి
బ్లేడ్‌ రన్నర్, డ్యాన్సర్, బిపిఓ ప్రొఫెషనల్‌


సుయాష్‌ జాదవ్‌
పారాలింపిక్‌ స్విమ్మర్, రియో–2016


మరియప్పన్‌ తంగవేలు
పారాలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్, హైజంప్, రియో–2016
 

మరిన్ని వార్తలు