గుడ్డు సొనతో ఇన్సులిన్‌

13 Jan, 2020 03:03 IST|Sakshi

పరి పరిశోదన

మధుమేహ నియంత్రణకు ఉపయోగించే ఇన్సులిన్‌ను కోడిగుడ్డు సొన నుంచి తయారు చేయడంలో విజయం సాధించారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. తరచూ ఇన్పులిన్‌ ఎక్కించుకునే వారు డయాబెటిక్‌ పంపులు వాడతారన్నది మనకు తెలిసిన విషయమే. అయితే వీటితో ఓ చిక్కు ఉంది. రెండు మూడు రోజుల్లో ఇన్సులిన్‌ కాస్తా గడ్డలు కట్టిపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్లనే వీటిని తరచూ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెల్బోర్న్‌లోని ఫ్లోరే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరోసైన్స్‌ అండ్‌ మెంటల్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు కత్రిమ ఇన్సులిన్‌ తయారీకి పూనుకున్నారు. జపాన్‌లోని ఒసాకా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభివద్ధి చేసిన ఒక టెక్నిక్‌ను మరింత మెరుగుపరచడం ద్వారా ఇందులో విజయం సాధించారు కూడా.

గుడ్డుసొనలో ఇన్సులిన్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు ఉంటాయని ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన శాస్త్రవేత్త అక్తర్‌ హుస్సేన్‌ తెలిపారు. గ్లైకోఇన్సులిన్‌ అని పిలుస్తున్న ఈ కొత్త రకం మందు అధిక ఉష్ణోగ్రతల్లో, గాఢతల్లోనూ గడ్డకట్టదని రక్తంలోనూ సహజ ఇన్సులిన్‌ కంటే ఎక్కువ స్థిరంగా పనిచేస్తుందని హుస్సేన్‌ వివరించారు. ఇన్సులిన్‌ పంపుల్లో ఉపయోగించేందుకు ఇది మంచి ప్రత్యామ్నాయం అవుతుందని అన్నారు. సాధారణ ఇన్సులిన్‌ రెండు రోజులు మాత్రమే పనిచేస్తే.. గ్లైకోఇన్సులిన్‌ ఆరురోజుల పాటు పనిచేస్తుందని తెలిపారు.ఈ మందు అందుబాటులోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి వంద కోట్ల రూపాయల వథా ఖర్చును అరికట్టవచ్చునని వివరించారు.

మరిన్ని వార్తలు