అన్నం ముద్ద మనిషి హక్కు

8 Dec, 2017 23:48 IST|Sakshi

చెట్టు నీడ

ఆహార హక్కు మనిషి కనీస హక్కు. భూమిపై పడిన ప్రతి ఒక్కరికీ భూమిపై మొలకెత్తిన ప్రతి గింజను పొందే నైతిక హక్కు ఉంది. నార్మన్‌ బొర్లాగ్‌ ఇలా అంటాడు : ‘‘నీ పక్కవాడు తినకుండా పడుకుంటే నీకా రోజు నిద్ర పట్టకూడదు. ‘బాగున్నావా’ అని అడిగే బదులు, ‘తిన్నావా?’ అని అడుగు. అప్పుడు వాడు నిజంగా ఎలా ఉన్నాడో తెలుస్తుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుస్తుంది. ఆకలి భయంతో సగం ప్రపంచం సూర్యోదయానికి భయపడుతూ లేస్తున్నప్పుడు నీ నాగరికతకు అర్థం లేదు.

దేవుడిపై నీ విశ్వాసానికి అర్థం లేదు. ఆకలి భయంతో సగం ప్రపంచం.. కన్నీటిని కూడా పొదుపుగా ఖర్చు చేస్తున్నప్పుడు నువ్వు ప్రబోధించే శాంతి సామరస్యాలకు అర్థమేలేదు’’ అని.   మనిషి ఆహారపు హక్కును కాపాడే ప్రయత్నం చేసిన అమెరికన్‌ వ్యవసాయ నిపుణుడు నార్మన్‌ బోర్గాగ్‌. ఆకలిగా ఉన్నవారికి ఇంత ముద్దను పెట్టడం కూడా మానవ హకుల్ని పరిరక్షించడం కిందికే వస్తుంది.
(రేపు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం)

మరిన్ని వార్తలు