సౌందర్య లహరి

7 May, 2018 01:11 IST|Sakshi

బాలతారగా వెండితెరపై ‘అర్జున్‌’ చిత్రంలో కనిపించారు లహరి. ఆ తర్వాత ‘చక్రవాకం’తో సీరియల్‌ ప్రేక్షకులకు చేరువయ్యారు. బుల్లితెర ‘సౌందర్య’గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ‘ఋతుగీతం’ టెలీ సీరియల్‌తో తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నారు. ఈ ‘సౌందర్య లహరి’తో సాక్షి ‘ఫ్యామిలీ’ ప్రతినిధి  సంభాషణలోని విశేషాలివి.


ప్రారంభం
లహరి ఏడో తరగతి చదువుతుండగా ‘అర్జున్‌’ సినిమాలో నటించడానికి  డ్యాన్స్‌ టీచర్‌తో కలసి సెట్స్‌కి వెళ్లారు. అలా ఆమె యాక్టింగ్‌ కెరీర్‌ మొదలైంది. ఆ సమయంలో దూరదర్శన్‌లో ప్రసారం అవుతున్న ‘బాలమందిరం’ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేశారు. తరవాత కొన్నాళ్లు స్టడీస్‌ మీదే దృష్టి పెట్టారు. పదో తరగతి సెలవుల్లో మళ్లీ ఆమె అభినయ ప్రయాణం మొదలైంది.

పునః ప్రారంభం
సెలవుల్లో బోర్‌గా ఉంటోందని అమ్మతో అన్నప్పుడు, కూతుర్ని ఆమె ఓ టీవీ చానల్‌ ఆడిషన్స్‌కి తీసుకెళ్లారు. కొన్నాళ్ల తర్వాత వాళ్లు ఏకంగా యాంకరింగ్‌కి పిలిచారు. ఆ తరవాత జీ టీవీలోనూ లహరి యాంకరింగ్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రోగ్రామ్స్‌ చేసే టైమ్‌లోనే ఆమె ఫొటోలు మంజులానాయుడుకు చేరాయి. వాళ్ల ప్రొడక్షన్‌లో ‘చక్రవాకం’ సీరియల్‌కి ఆమెను తీసుకున్నారు.

ఆ సీరియల్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు లహరి ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. తర్వాత మళ్లీ వాళ్ల ప్రొడక్షన్‌లోనే వచ్చిన ‘మొగలిరేకులు’, ‘శ్రావణ సమీరాలు’ సీరియల్స్‌లో చేశారు. ఇంకా గుణ్ణం గంగరాజు ‘రాధ మధు’, అన్నపూర్ణ వారి ‘పుట్టింటి పట్టుచీర’, ‘సావిరõ ’లలో నటించారు. చేశారు. ప్రస్తుతం ఋతుగీతం (ఋతురాగాలు – 2)లో చేస్తున్నారు.

నటనకు గుర్తింపు
‘కల్యాణ తిలకం’లో లహరి డ్యూయల్‌ రోల్‌ చేశారు. ఆ సీరియల్‌కి చాలా అవార్డులు అందుకున్నారు. ‘ముద్దుబిడ్డ’కు కూడా అవార్డులు వచ్చాయి. ‘రాధ మధు’ సీరియల్‌కి నంది అవార్డు వచ్చింది! ‘పక్కింటి అమ్మాయి,  అత్తో అత్తమ్మ కూతురో, మమతల కోవెల, గోకులంలో సీత ఇలా అనేక సీరియల్స్‌లో ఆమెకు గుర్తింపు వచ్చింది.

‘‘పాజిటివ్‌ రోల్‌ వేసినా, నెగిటివ్‌ రోల్‌ వేసినా నన్ను టీవీ ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది’’ అంటారు లహరి. ఇప్పటిదాకా 16 సీరియల్స్‌కి పైగా చేశారు. నటి సౌందర్య పోలికలు ఉండడంతో బుల్లి తెర సౌందర్యగా కూడా ఆమె ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.

ఇంట్లో ఉన్నట్లే
ఒక పక్క సీరియల్స్‌ చేస్తూనే కొన్ని సినిమాలలో కూడా నటించారు లహరి. కందిరీగ, డాన్‌ సీను. ఆరెంజ్, గ్రీకు వీరుడు, రారా కృష్ణయ్యా (సెకండ్‌ హీరోయిన్‌) వాటిల్లో కొన్ని. ‘‘సినిమాల కంటె సీరియల్స్‌లో నటించడమే సౌకర్యంగా అనిపిస్తుంది.

ఇంటి నుంచి బయలుదేరి షూటింగ్‌ స్పాట్‌కి  వెళ్లినా అక్కడ కూడా ఇంట్లో ఉన్న భావనే కలుగుతుంది’’ అంటారు లహరి.  ‘సూపర్‌’, ‘నర్తనశాల’ వంటి టీవీ షోలకు యాంకరింగ్‌గా చేయడం గురించి ‘డిఫరెంట్‌∙జర్నీ. నైస్‌ ఫీలింగ్‌’ అంటారు. లహరి పదో తరగతి వరకు డాన్‌బాస్కో హైస్కూల్‌లో చదివారు. బీటెక్‌ మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో, మాస్టర్స్‌.. హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీలో చేశారు. లహరి.. ఓన్లీ డాటర్‌.

పేరెంట్స్‌ పాత్రే కీలకం
ఒక రంగంలో రాణించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రధానం. లహరికి కూడా పేరెంట్స్‌ మంచి సపోర్టివ్‌గా ఉన్నారు. ‘‘మా అమ్మ లక్ష్మీమణి, నాన్న విశ్వనాథం ఇద్దరూ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. నేను ఒక ప్రాజెక్టు చేస్తున్నాను అనగానే అమ్మ నాతో వస్తుంది. లొకేషన్‌ చూసుకుంటుంది. ఆ తరవాత నన్ను ఒంటరిగా పంపుతుంది.

అమ్మకు కుదరకపోతే నాన్న వస్తారు. నా కెరీర్‌ ఇంత జాలీగా వెళ్లిపోతోందంటే వాళ్ల వల్లే. లొకేషన్‌లో అందరూ మా పేరెంట్స్‌ గురించి ముందర అడుగుతారు’’ అని చెబుతున్న లహరి, అమ్మ తన పర్సనల్‌ డైరెక్టర్‌ అంటారు. ఆమె సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగి. కూతురి పర్సనల్‌ మేకప్, డ్రెస్సింగ్, యాక్టింగ్‌ అన్నిట్లోనూ ఆమే  గైడ్‌ చేస్తారు సెంట్రల్‌ గవర్నమెంటు ఉద్యోగి అయిన లక్ష్మీమణి.

మరిన్ని వార్తలు