పాదాల అందం ఇలా పదిలం..

19 May, 2016 23:05 IST|Sakshi
పాదాల అందం ఇలా పదిలం..

బ్యూటిప్స్

 
సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం చాలా మంది పాదాలకు ఇవ్వరు. వస్త్రధారణ ఎంత బాగున్నా పాదాలు అందంగా, ఆరోగ్యంగా లేకపోతే అజాగ్రత్తగలవారి జాబితాలో చేరిపోతారు. మడమ దగ్గర మురికిగా ఉండటం, పగుళ్లు బారడం.. వంటివి కనిపించకుండా ఉండాలంటే...

     
రోజూ రాత్రి పడుకునేముందు పాదాలను శుభ్రంగా కడిగి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫూట్ క్రీమ్‌లో గ్లైకోలిక్ యాసిడ్ ఉన్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు, చర్మం మృదువుగా ఉంటుంది. ఈ క్రీమ్ రాసిన తర్వాత సాక్స్ ధరించాలి.నాణ్యమైన బాడీ లోషన్‌ను కాళ్లకు, పాదాలకు రాయాలి.

     
బాదం నూనె, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో రోజూ పడుకునే ముందు లేదా ఉదయం లేచాక మసాజ్ చేసుకుంటే పాదాలకు మంచి విశ్రాంతి లభిస్తుంది. పాదాల చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. ప్యుమిక్‌స్టోన్‌తో రుద్ది, కడిగితే మృతకణాలు సులువుగా వదులుతాయి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి, తుడిచి, ఫ్రూట్‌క్రీమ్‌ను తప్పక రాసుకోవాలి. పాదాలు నొప్పిగా ఉంటే గోరువెచ్చని నీటిలో సుగంధనూనె కొన్ని చుక్కలు వేసి, అందులో కాళ్లు పెట్టి సేద తీరాలి.కాళ్లకు ఉన్న అవాంఛిత రోమాలను తొలగించాలంటే లేజర్ కన్నా వాక్సినేషన్ సరైన పద్ధతి.స్నానం చేసేటప్పుడు నీళ్లలో కొన్ని చుక్కల నూనెను కలిపితే కాళ్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోదు.

     
పాదాల పగుళ్లు తగ్గాలంటే... క్యాండిల్ వాక్స్, ఆవనూనె కలిపి వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లు ఉన్న చోట రాయాలి. తర్వాత కాటన్ సాక్స్ ధరించాలి. రాత్రి మొత్తం ఇలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రపరుచుకోవాలి. ఈ జాగ్రత్తలతో పాటు కాలి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం, మసాజ్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

 

మరిన్ని వార్తలు