కలత నిదురలో కలలాగా జారిపోకే జవరాలా

19 Mar, 2018 01:39 IST|Sakshi

పదం పలికింది – పాట నిలిచింది

దాదాపుగా అన్నిసార్లూ పాటను పైకి లేపేది దాని ట్యూనే. వినసొంపైన ట్యూనంటూ పడ్డాక, దాని మీటరుకు అనుగుణంగా కట్టే పదాల మాల ఎలాంటిదైనా అది ఇట్టే పరిమళిస్తుంది. ఆ ఇట్టే పరిమళించే మాలలో కూడా కవిత్వాన్ని పొదగ్గలిగితే ఆ పాట గుణం రెట్టింపవుతుంది. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ కోసం కందికొండ రాసిన – 
‘మళ్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా
తుళ్లి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా’ పాట మధ్యలో–
‘కలత నిదురలో కలలాగా జారిపోకే జవరాలా’ అని వస్తుంది. ప్రేయసి పట్ల ప్రియుడికి గల కోల్పోయే భయాన్ని చాలా చక్కగా ఈ పాదం వ్యక్తీకరిస్తుంది. 
‘సిరి సిరి మువ్వల చిరుసడి వింటే స్మృతిపథమున నీ గానమె
పొంగిపారె యేటిలో తొంగి తొంగి చూస్తే తోచెను ప్రియ నీ రూపమే’
‘సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులో తగిలెను నీ మృదు పాదమె’ లాంటి వాక్యాలు కూడా మంచి భావనలు. దీనికి చక్కటి సంగీతం కూర్చింది చక్రి. గాయనీ గాయకులు కౌసల్య, హరిహరన్‌. తనూ రాయ్, రవితేజ నాయికానాయకులు. 2001లో వచ్చిన ఈ చిత్రానికి దర్శకుడు పూరీ జగన్నాథ్‌. 
 

మరిన్ని వార్తలు