24న విత్తన మేళా

22 May, 2018 11:59 IST|Sakshi

రైతులకు నాణ్యమైన విత్తనం అందించే లక్ష్యంతో ఈ ఏడాది మే 24(గురువారం)న హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌తో పాటు.. పాలెం, జగిత్యాల(పొలాస), వరంగల్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన సంచాలకులు డాక్టర్‌ నగేష్‌ కుమార్‌ తెలిపారు. విశ్వవిద్యాలయంలో రూపొందించిన 9 రకాల ఖరీఫ్‌ పంటల విత్తనాన్ని రైతులకు విక్రయిస్తారు.

వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తనాలతో పాటు భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ, భారతీయ వరి పరిశోధనా సంస్థ, భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థలు రూపొందించిన ఫౌండేషన్, సర్టిఫైడ్‌ విత్తనాలను రైతులకు విక్రయిస్తారు. వరి 4 సన్న రకాలు(ఆర్‌.ఎన్‌.ఆర్‌.15048, బీపీటీ 5204 సహా), వరి 3 దొడ్డు రకాలు, మొక్కజొన్న–డి.హెచ్‌.ఎం. 117, పాలమూరు జొన్న(సి.ఎస్‌.బి. 31), కందులు 3 రకాలు, పెసలు 4 రకాలు, మినుములు–పి.యు.31, ఆముదాలు–పి.సి.హెచ్‌. 111, నువ్వులు –స్వేత విత్తనాలను ఒకే చోట రైతులకు విక్రయిస్తారు. వివరాలకు.. 8008404874 నంబరులో సంప్రదించవచ్చు. 

27న పశుగ్రాసాల సాగుపై రైతులకు శిక్షణ
పశుగ్రాసాల పెంపకంపై రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు రైతు శిక్షణా కేంద్రంలో ఈ నెల 27(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నారు. సూపర్‌ నేపియర్‌ పశుగ్రాసం సాగుపై రైతు సీతారామశాస్త్రి, గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్‌ డా.వెంకట శేషయ్య శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. 

లాంఫాంలో అమ్మకానికి మిరప విత్తనాలు

గుంటూరు సమీపంలోని ఉద్యాన పరిశోధన స్థానం లాంఫాంలో ఎల్‌సీఏ–620, ఎల్‌సీఏ–625, సీఏ–960 (సింధూర్‌) మిరప రకాల ఫౌండేషన్‌ విత్తనాలను అమ్ముతున్నట్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ ఎల్‌. నారంనాయుడు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు అమ్ముతున్నారు. కిలో విత్తనం ధర రూ.800గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా ఈ విత్తనాలను విక్రయిస్తామని తెలిపారు. వివరాలకు ఉద్యాన శాస్త్రవేత్త డా. సి. వెంకటరమణ – 94405 92982. 

మరిన్ని వార్తలు