స్త్రీలోక సంచారం

14 Dec, 2018 23:35 IST|Sakshi

ఆడవాళ్లలా మగవాళ్లు మళ్లీ మళ్లీ కలిసి కబుర్లు చెప్పుకోడానికి ఎందుకనో పెద్దగా ఆసక్తి చూపించరని 49 ఏళ్ల హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ అన్నారు. ‘లేట్‌ నైట్‌ షో విత్‌ జేమ్‌ కార్డన్‌’ కార్యక్రమానికి అతిథిగా హాజరైన జెన్నిఫర్‌.. ‘‘మీరంతా ఎందుకు మళ్లీ కలిసి నటించరు?’’ అని ఆడియన్స్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ ‘‘బాయ్స్‌కి పెద్దగా ఫీలింగ్స్‌ ఉండవనుకుంటాను’’ అని అన్నారు. 1994 నుండి 2004 వరకు పదేళ్ల పాటు అమెరికన్‌ టెలివిజన్‌ చానల్‌ ఎన్‌.బి.సి.లో ‘ఫ్రెండ్స్‌’ అనే సిట్‌కామ్‌ (సిట్యుయేషన్‌ కామెడీ)లో జెన్నిఫర్‌తో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు నటించారు. ఆ ఆరుగురూ ఫ్రెండ్స్‌. న్యూయార్క్‌ సిటీలో ఉంటారు.

నిత్యజీవితం వాళ్లని ఎన్నివిధాలుగా దోపిడీ చేస్తుంటుందో ఆ సిట్‌కామ్‌లో హాస్యభరితంగా చూపించారు. పదేళ్ల పాటు సాగిన ఆ హిట్‌ ధారావాహికతో జెన్నిఫర్, మిగతా ఇద్దరు అమ్మాయిలు కోర్టెనీ, లీసా.. అమెరికన్‌ టీవీ సీరియళ్ల చరిత్రలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణులుగా రికార్డు సాధించారు. అప్పట్లో వీళ్లతో కలిసి ఆ సీరియల్‌ నటించిన ముగ్గురు అబ్బాయిలు డేవిడ్, మాట్, మేథ్యూ.. ఇప్పుడు ‘రీయూనియన్‌’ అంటే.. ‘నో ఇంట్రెస్ట్‌’ అంటున్నారట. అదే విషయాన్ని జెన్నిఫర్‌ ‘లేట్‌ నైట్‌ షో’లో ఇంకోలా చెప్పారు.. బాయ్స్, పూర్వ స్నేహాల పట్ల పెద్ద ఎగై్టట్‌మెంట్‌తో ఉండరని.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు