ఝున్‌ఝున్‌వాలాఆర్థిక సూత్రాలు...

6 Sep, 2014 00:13 IST|Sakshi
ఝున్‌ఝున్‌వాలాఆర్థిక సూత్రాలు...

ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒక కళ. అంతర్జాతీయంగా ఇన్వెస్ట్‌మెంట్ గురుగా పేరొందిన వారెన్ బఫెట్, దేశీయంగా రాకేశ్ ఝున్ ఝున్‌వాలా ఈ కళను ఔపోశన పట్టిన వారిలో అగ్రగణ్యులు. ఝున్‌ఝున్‌వాలాను దేశీ వారెన్ బఫెట్ అని కూడా అంటారు. అత్యధిక లాభాలు అందించగలిగే స్టాక్స్‌ను ఒడిసిపట్టుకోగలిగే నేర్పు ఆయన సొంతం. ఆయన ప్రస్తుత సంపద విలువ రూ. 6,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇన్వెస్టరుగా విజయాలు సాధించేందుకు ఆయన పాటించే సూత్రాలు ఇవి..
 
 1.ఆశావహంగా ఉండాలి. ఇన్వెస్టరుకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన గుణం ఇదే.
 
 2.వాస్తవిక రాబడులనే ఆశించాలి. అత్యాశకు పోవద్దు.. అలాగని అతిగా భయపడనూ కూడదు.
 
 3.నాలుగు అక్షరాల ఇంగ్లిష్ పదం రిస్క్‌ను గుర్తుంచుకోవాలి. పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి.
 
 4.క్రమశిక్షణ ఉండాలి. ప్రణాళికంటూ ఉండాలి.
 
 5.సందర్భాన్ని బట్టి ఊసరవెల్లిలాగా వ్యూహాన్ని మార్చుకోగలగాలి.
 
 6.భిన్నంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయగలగాలి.
 
 7.ఏది కొంటున్నామన్నది ముఖ్యం. ఎంతకు కొంటున్నాం అన్నది అంతకన్నా ముఖ్యం.
 
 8.ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నమ్మకం, ఓపిక ఉండాలి. అప్పుడే ప్రతిఫలం దక్కుతుంది.
 
 9.సందర్భాన్ని బట్టి లాభనష్టాలు, సెంటిమెంటు నిమిత్తం లేకుండా వైదొలగాలి.
 
 10.ఉచిత సలహాలపై ఆధారపడొద్దు. అరువు జ్ఞానంతో లాభాలు రావు. స్వయంగా అధ్యయనం చేసి ముందడుగు వేయాలి.
 

>
మరిన్ని వార్తలు