అప్పుడే చేయి ఆరోగ్యంగా ఉన్నట్టు!

6 Mar, 2018 01:01 IST|Sakshi

చెట్టు నీడ 

ఆయన దాన్ని మనసులో పెట్టుకుని,  గుప్పిట మూసుకుని సాయంత్రం ఇంటికి వెళ్లాడు. భార్య గమనించి, ‘ఏమైంది?’ అని ఆశ్చర్యంగా అడిగింది. 

ఒక ఊళ్లో ఒకాయన ఉండేవాడు. ఎవరికి ఏమైనా అవసరమొచ్చినప్పుడు సాయం చేయడానికి వెనుకాడేవాడు కాదు. వీధిలో ఎదురుపడి తమ కష్టం చెప్పుకున్నా కూడా, ‘మా ఇంటికెళ్లి నా భార్యతో చెప్పి తీసుకో’ అని వాళ్లకు కావాల్సింది అందేట్టు చూసేవాడు. అయితే, ఈ «ధోరణి ఆయన భార్యకు నచ్చేది కాదు. కొన్నిసార్లు ఆ సాయం చేయడానికి నిరాకరించేది కూడా. ఒకరోజు అలా తిరగ్గొట్టిన విషయం ఆయనకు తెలిసింది. ఆయన దాన్ని మనసులో పెట్టుకుని, గుప్పిట మూసుకుని సాయంత్రం ఇంటికి వెళ్లాడు. భార్య గమనించి, ‘ఏమైంది?’ అని ఆశ్చర్యంగా అడిగింది.  ‘ఇది ఎప్పుడూ ఇలాగే వుందనుకో, దాన్నేమంటావ్‌?’ అని ప్రశ్నించాడు.  ‘ఏదో వైకల్యం ఉన్నట్టు’ అని జవాబిచ్చింది.

మళ్లీ పూర్తిగా అరచేయిని చాచి చూపిస్తూ, ‘ఎప్పుడూ ఈ చేయి ఇలాగే ఉండిపోయిందనుకో, దాన్నేమంటావ్‌?’ అన్నాడు.ఏం చెప్పబోతున్నాడో అర్థం చేసుకుంటున్నట్టుగా, ‘ఇది కూడా ఇంకో రకం వైకల్యమే’ అని జవాబిచ్చింది.‘అదీ, అందుకే నువ్వు నా మంచి భార్యవు’ అని నవ్వుతూ తన పనిలో పడిపోయాడు. సంపద వచ్చినప్పుడు కాపాడాలి. వచ్చినదాన్ని పంచుతూవుండాలి. అప్పుడే చేయి ఆరోగ్యంగా ఉన్నట్టు! ఆ పైన ఎప్పుడూ ఆమె సాయం చేయడానికి వెనుకాడలేదు.

మరిన్ని వార్తలు