టెంపరేచర్‌ కాదు టెంపర్‌మెంట్‌ ఉండాలి

3 Dec, 2017 00:40 IST|Sakshi

25 ఇయర్స్‌ ఇండస్ట్రీ... కాని ఒక్క రోజు కూడా షూటింగ్‌కు డుమ్మా కొట్టలేదు అంటున్నది కాజోల్‌. ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘కుచ్‌ కుచ్‌ హోతాహై’, ‘కభి కుషీ కభి గమ్‌’ వంటి పాట్‌ బాయిలర్లలో నటించిన కాజోల్‌ 25 ఏళ్లలో ఒక్కసారి కూడా తన కారణంగా షూటింగ్‌ కేన్సిల్‌ చేయించలేదని చెబుతోంది. ఒక్కోరోజు షూటింగ్‌ జరగకపోతే లక్షల కొద్దీ డబ్బు వేస్ట్‌ అవుతుంది. అది నా డబ్బు కాదు. నిర్మాతది. నిర్మాత జేబుకు చిల్లు పెట్టి నేను చిల్‌ కావడం కరెక్ట్‌ కాదు.

అందుకే జ్వరం వచ్చిన రోజుల్లో కూడా నేను షూటింగ్‌కు హాజరయ్యాను అంటోంది కాజోల్‌. మరి మన హీరోయిన్స్‌ వింటున్నారా? మన మేడమ్స్‌ అట... డ్రస్సు లూజ్‌ అయ్యిందని, షూ హీల్‌ తక్కువైందని, సెట్‌లో జూస్‌ అందలేదని, మమ్మీకి కుర్చీ సరిగా వేయలేదని, కుక్కపిల్ల టామీకి మటన్‌ పీస్‌ నచ్చలేదని... షూటింగ్స్‌ కేన్సిల్‌ చేస్తుంటారట. దీంతో ప్రొడ్యూసర్స్‌ చస్తున్నారు. మేనేజర్స్‌ నలుగుతున్నారు. కో ఆర్టిస్ట్స్‌ నెత్తి కొట్టుకుంటున్నారు. అయితే ఇన్ని మాటలు చెప్పిన కాజోల్‌ కూడా ఒకసారి షూటింగ్‌ కేన్సిల్‌ చేసిందట.

అదేంటి... తనకు జ్వరం వచ్చినా షూటింగ్‌కు వచ్చిందని కదా చెప్పుకున్నాం. జ్వరమే. కాని తనకు కాదు. తన కూతురు నైసాకు. పాపకు 104 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్ల పర్మీషన్‌ తీసుకుని, కో ఆర్టిస్టులకు చెప్పి షూటింగ్‌ కేన్సిల్‌ చేసిందట. అందుకే కాజోల్‌ లాంటి హీరోయిన్ల కోసం నిర్మాతలు టెంపుల్‌కెళుతున్నారు. కాజోల్‌ గ్రేట్‌ యాక్టరే కాదు అంతకన్నా గ్రేట్‌ మమ్మీ కూడా.

మరిన్ని వార్తలు