ఆయన కళగన్నారు

2 Oct, 2019 04:57 IST|Sakshi

మహాత్మాగాంధీ దేశం గర్వించదగ్గ నాయకుడు. అంతకు మించి ఆయన ఒక విశిష్ట విశ్వ మానవుడు. అటువంటి గాంధీజీ కళల గురించి ఎలా ప్రతిస్పందించే వారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.‘సంగీతం గొంతులోంచి వచ్చేది కాదు. సంగీతం అంటే మేధ, ఇంద్రియాలు, మనసు.. ఈ మూడింటి నుంచి వెలువ డే ఒక గొప్ప విషయం’ అనేది గాంధీ మాట.  1926 ఏప్రిల్‌ 15న అహ్మదాబాద్‌లో మాట్లాడుతూ– ‘సంగీతం గురించి మనం మరింత విశాలంగా ఆలోచించాలి. అందలి లయ, శృతి, స్పందన ఈ మూడు లేకుండా జీవితం లో ఏ పనినీ చేయలేం. అలా ఆలోచిస్తే ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను సంగీతాభ్యాసం కోసం పంపిస్తారో వారు ఈ దేశ పురోగమనానికి దోహదపడే వ్యక్తులు కాగలరు’.

‘కళ కళ కోసమే’ అంటే గాంధీజీ ఏకీభవించలేదు. ‘ఏ కళ మనిషిని సంస్కరించి విశాల దృక్పథం వైపు మరల్చగలదో అదే కళ అంటే’ అని నిర్వచించారాయన.మరొకసారి ఆయన ఇలా అన్నారు– ‘ఎందుకో గానీ, మనం సంగీతం అంటే ఒక పాట పాడడం, ఒక వాయిద్యాన్ని తగు నైపుణ్యంతో వినిపించడం అనుకుంటున్నాం. కానీ, నిజానికి సంగీతం అంటే ఏక తాళం, ఏకతా రాగం. అది ఆ మనిషి హృదయ తంత్రులన్నీ కలిపి ఒకే ఒక అపురూప స్వరంగా గానం చెయ్యడమే’. ఎంత లోతైన భావన ఇది!

గాంధీ చాలా విషయాలను క్షుణ్ణంగా చర్చించారు. అలా ఆయన కళలను గురించి ఎలా నిర్వచించారో కూడ మనం తెలుసుకోవాలి. నిజానికి ఆయన దృక్కోణం మానవతా కోణం. ఆయన చెప్పిన మాటలు ఆ కాలపు ఎందరో కళాకారులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. ‘నాకు ఎందుకో గాని, సంగీతమంటే చరఖా ఆడినప్పటి ధ్వనియే అనిపిస్తుంది. అలా స్వహస్తాలతో నేసిన ఖాదీ వస్త్రమే శృతి శుద్ధమైన సంగీతంగా అనిపిస్తుంది! యావత్‌ భారతావనిలోని కోట్ల మంది పౌరులు ఒకే పాట ఆలపించినపుడు, ఈ బంజరు భూముల నుంచి స్వేచ్ఛాగీతాలు ఉద్భవించినప్పుడు... అప్పుడే సంగీతం అనే ప్రయోగం సఫలమైనట్టుగా నేను భావిస్తాను’. ఎంతటి మహత్తరమైన ఆకాంక్ష కదా ఇది!

గాంధీ దక్షిణాఫ్రికా ఆశ్రమంలో తొలినాళ్లలోనే సాయం సమయపు ప్రార్థనను ఆశ్రమ దినచర్యలో భాగంగా చేశారు. సబర్మతిలో పండిట్‌ ఎన్‌.ఎం.ఖారే, వినోబాభావే, బల్కోవాభావే, మామా ఫడ్కే వంటి ప్రముఖ సంగీతకారులు ఆస్థా న కళాకారులుగా ఉండేవారు. ప్రతి కాంగ్రెస్‌ సమావేశంలోనూ పాటల ఆలాపన, వాద్యసంగీతం అంతర్భాగంగా ఉండేవి.గాంధీని ఒకరు, ‘మీ జీవితంలో సంగీతం పాత్ర ఏమిటి?’ అని అడిగారు. దానికి ఆయన నవ్వుతూ, ‘నా చుట్టూ ఉన్న సంక్షోభం, ఒత్తిడితో నేనెప్పుడో ఎండుటాకులా కొట్టుకుపోయే వాడిని. సంగీతమనే ఒక విశిష్టమైన శక్తి నాకు తోడుగా ఉంది కాబట్టి ఇలా ఉన్నాను!’ అని సమాధానం ఇచ్చారు.

ఆయన ‘నితివం కవ్యో’ పేరిట కొన్ని భజనలు, ‘రామధున్‌’అనే ప్రార్థనాగీతం సేవాగ్రాంలో ఎప్పుడూ పాడిస్తూ ఉండేవారు. ‘వైష్ణవ జనతో తేనే కహియతి’ అనే పాటను ఎం ఎస్‌ సుబ్బులక్ష్మి గళంలో రికార్డు చేసి పంపాలని ఆయన స్వయంగా ఉత్తరం రాసి పంపారు. హిందుస్తానీ సంగీతంలో తనకు అంతగా ప్రవేశం లేదు గనుక ఈ భజన ఎలా పాడగలనో? అని సుబ్బులక్ష్మి సందేహం వెలిబుచ్చారు. ‘మీ ఆర్ద్రత నిండిన గళంలో దానిని వచనంగా మాట్లాడినా నేను స్వీకరిస్తాను’ అని ఆయన చెప్పారు. ఆ పాట ఎంత సౌహార్ద్రగీతం అయిందో. అంతకుమించి ప్రాచుర్యం పొందింది.

‘సత్యం–అహింస’ అనే రెండు రాగాలు, ‘స్వదేశీ ఖాదీ’ అనే రెండు వాయిద్యాలు, ’నిస్వార్థం బ్రహ్మచర్యం’ అనే రెండు స్వరా లు, ’హింస–చౌర్యం’అనే రెండు నిషిద్ధ స్వరాలతో.. చరఖా తిప్పేటప్పుడు వచ్చేటి శబ్దమే సంగీతంగా మహాత్ముని స్వేచ్ఛాగీతం నిరంతరం సాగేది’ అని గాంధీజీ గురించి డాక్టర్‌ నమ్రతా మిశ్రా చెప్పిన మాటలు విలువైనవి.నందలాల్‌ బోస్‌ అనే శాంతి నికేతన్‌ కళాకారునితో గాం ధీకి మంచి సంబంధాలు  ఉండేవి. 1936 లక్నో కాంగ్రెస్‌ సమావేశంలో బోస్‌ భారతదేశ గ్రామీణ కళారూపాలను ప్రదర్శనగా అమర్చారు. దొరికే గడ్డి, మన్ను, కొబ్బరిపీచు, వెదురు, టెర్రకోట వంటి ముడి పదార్థాలతో తయారు చేసిన ఈ కళారూపాలు గాంధీ మనసు దోచుకున్నాయి. ‘ఈ కళారూపాలు నాటకం, సినిమా వలే చలన చిత్రాలు కావు. కానీ ఇదే, మన దేశ మౌలిక కళా స్వరూపం’ అని గాంధీ ప్రశంసించారు.

కె.వెంకటప్ప అనే శాంతినికేతన్‌ విద్యార్థి గీసిన వర్ణచిత్రాలు చూసి గాంధీజీ చాలా సంబరపడ్డారు. ‘మీకు నా ఆశీస్సులు. కానీ, చరఖా ఏవిధంగానైనా మిమ్ములను ప్రభావితపరచగలదా? ఒక సగటు గ్రామస్తుని జీవితాన్ని చరఖా ఎంతగా అర్థవంతం చేస్తుందో... మీరేమైనా తెలుసుకోగలిగితే దాన్నీ ఒక చిత్రంగా మీరు చేయగలరేమో ప్రయత్నించండి’ అని అభ్యర్థించారు1930లో రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌కు వెళ్లిన గాంధీ లండన్లో అమెరికన్‌ శిల్పి ఎ.పీ జు డేవిడ్‌ తయారుచేసిన శిల్పాల సందర్శనకు వెళ్లిన పుడు, అక్కడి కొందరు చిత్రకారులు గాంధీ రేఖాచిత్రాన్నే వేయడానికి వచ్చి, ‘క్షణక్షణం మారిపోయే ఒక మానవ రూపమే గాంధీ’ అన్నారట.స్వాతంత్య్రం రాక మునుపే ‘జాతీయ గ్రామీణ పరిశ్రమ సమాఖ్య’ను ఏర్పాటు చేయాలని గాంధీ కలలు కన్నారు. మహాత్మా గాంధీ దృష్టిలో సత్యం, శ్రమ, సౌందర్యం ఒకదానితో ఒకటి పెనవేసుకున్నవి. రసాత్మకత లేని పని వ్యర్థమనీ, ఎవరికి వారు కళా సౌందర్యం, నైపుణ్యం తమ దైనందిన కార్యాలన్నిటిలో అవలంబించాలని, ఆయన కోరుకునే వారు.‘ఒక వ్యక్తి సంతోషం అంటే కేవలం వారి బహిరంతరాలలో కానవచ్చే ఉల్లాసం. అలాంటి లక్షల హృదయాల ఆనంద క్షణాలను వ్యక్తీకరించేదే కళ’ అంటారాయన. సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని కళను నిర్వచించిన మహనీయుడు గాంధీజీ. ఛి

ప్రపంచ ప్రఖ్యాత స్త్రీవాద ఉద్యమ నాయకురాలుమార్గరెట్‌ సెంజెర్‌ 1936లో గాంధీజీని ఇంటర్వ్యూ చేశారు. అందులో ఆమె ఒక తమాషా మాట రాశారు.‘గాంధీ ముఖంలో ఒక కాంతి ఉంది. ఒక మార్మికత ఉంది. దానిని స్త్రీలు బాగా గుర్తించారు. గుర్తించడంలో పురుషులు విఫలమయ్యారు’.కాళ్లకూరి శైలజ

ఊతకర్రలు
బుల్లెట్‌ తాకే వరకు తోడు నిలిచారు
గాంధీజీ తన జీవన యానాన్ని కేవలం ఒక ‘పురుషుడి ప్రయాణం’గా ఎప్పుడూ భావించలేదు. ఒక సహ మానవుని ప్రయాణంగా భావించారు. ఆ ప్రయాణంలో స్త్రీలకు ఎప్పుడూ చోటిచ్చారు. అప్పటి భావజాలంతో చూస్తే, ఆనాటి ఇతర నాయకుల భావజాలంతో పోల్చితే గాంధీజీ స్త్రీల విషయంలో ఎంతో ఆధునికునిగా కనిపిస్తారు.గాంధీజీ తన భార్య కస్తూర్బాను ధార్మిక సహజీవనిగా గౌరవించారు. అందువల్లే కస్తూర్బా గాంధీజీ జీవితంలోని అన్ని ఆటుపోట్లలో అండగా నిలిచారు. ఉద్యమంలో ఆయనతో కలసి జైలుకు వెళ్లారు. నిజానికి వారి సాంసారిక జీవితంలోని ఒక యాదృచ్ఛిక ఘటన గాంధీజీ మనసులో బ్రహ్మచర్యం అలజడిని రేపిందని అనిపిస్తుంది. ఆ రోజు గాంధీజీ తండ్రి కరమ్‌చంద్‌ తుది ఘడియలు లెక్కిస్తున్నారు.

అర్ధరాత్రి. అంతా మెలకువతో ఉన్నారు. ఒక బంధువు గాంధీజీ దగ్గరకు వచ్చి నీవు కొద్దిసేపు పడుకో అని పంపించేశారు. ఆ సమయంలో ఆయన కస్తూర్బా గదిలోకి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత ఎవరో తలుపు తట్టి తండ్రి మరణవార్త చెప్పారు. ఆ క్షణంలో గాంధీజీ ఆత్మచింతనకు లోనయ్యారు. ఆ బంధువు వెళ్లి పడుకోమని చెప్పినంత మాత్రానే తాను భార్య ఉన్న గదిలోకి వెళ్లడానికి కారణం దేహవాంఛేనని గాంధీజీ నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. దీంతో 1901 నుంచి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరణలో పెట్టారు. కస్తూర్బా ఆయన నిర్ణయాన్ని గౌరవించకపోతే ఇది జరిగేది కాదు. అందుకనే గాంధీజీ ఆమెలో చాలాసార్లు తల్లిని చూసుకునేవారు. గాంధీజీ జీవితంలో కష్ట సమయం 1944లో కస్తూర్బా కన్నుమూసిన తరువాతే ఆరంభమైంది. కస్తూర్బా లేని శూన్యత గాంధీ చివరి రోజుల్లో కనిపించింది.కస్తూర్బా

పాశ్చాత్య వనితలు
గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా మహిళలు భక్తితో, గౌరవంతో,  దైవికమైన ఆకర్షణతో ఆయనకు సన్నిహితులయ్యారు. వారిలో తొలిస్థానం మిల్లీ గ్రాహమ్‌ పోలాక్‌ అనే పాశ్చాత్య వనితదే. ఆమె దక్షిణాఫ్రికాలోనే ఉండేది. భర్త గాంధీజీ మిత్రుడే. అక్కడే పరిచయమైన మరో మహిళ సొంజా షెల్సిన్‌. ఆమె గాంధీజీ కార్యదర్శి. అంత మంచి కార్యదర్శి మళ్లీ లభించలేదని గాం«ధీ అభిప్రాయం. ఆయన జీవితంలోకి ఇలా వచ్చి అలా నిష్క్రమించిన వారి లో నిల్లీ క్రేమ్‌ కుక్‌ (అమెరికా) ఒకరు. ఇంకా మార్గరెట్‌ స్పీజెల్‌ (జర్మనీ), ఎస్తేర్‌ ఫేరింగ్‌.. గాంధీని దగ్గరి నుంచి చూసిన మహిళలు. సొంజా షెల్సిన్‌

వీరు కూడా..
గాంధీజీతో సాన్నిహిత్యం కలిగిన ఆశ్రమవాసులలో లీలావతి అసార్‌ ఒకరు. ఈమెను గాంధీజీ ‘నత్తగుల్ల’ అని ముద్దుగా పిలిచేవారు. కంచన్‌ షా అనే మహిళ బ్రçహ్మచర్యం పాటించడంలో గాంధీగారి మెప్పు పొందింది. 1920లో గాంధీజీకి ‘ఊతకర్రలు’ వచ్చాయి. అవి కొయ్యలు కాదు, మనుషులే. పేర్లు సుశీలా నయ్యర్, మనుబెన్, అభా బెన్‌. సుశీల గాంధీగారి వ్యక్తిగత వైద్యురాలు. మను, అభా ఆయన మనుమరాళ్లు. వీరిలో ఎవరు అందుబాటులో ఉంటే వారు గాంధీజీ నడవడానికి ఆసరా కల్పించేవారు.అందుకే వారిని ఊతకర్రలు అని పిలుస్తుండే వారాయన. అభా బెన్‌ గాంధీజీ మునిమనుమడు కను గాంధీ భార్య. కను గాంధీ గాంధీజీ వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. గాడ్సే గాంధీజీని కాల్చినప్పుడు మనుతో పాటు మరొక పక్కనవున్న యువతి అభాయే. ప్రేమా బెన్‌ కంతక్, ప్రభావతి, రాజకుమారి అమృత్‌కౌర్‌లను కూడా గాంధీజీ ఎంతో ఆదరంతో చూసేవారు. గాంధీ సేనకు ప్రేమా బెన్‌ను మార్షల్‌ అని అంటుండే వారు. ఈమె తరచు గాంధీజీతో బ్రహ్మచర్యం గురించి చర్చించేది.ప్రభావతి


ఇక ప్రభావతి ఉదంతం మరీ ప్రత్యేకమైనది. ఆమె జయప్రకాశ్‌ నారాయణ్‌ (లోక్‌నాయక్‌) భార్య. పెళ్లయ్యాక ఆశ్రమానికి వచ్చారు. గాంధీజీ ఆశయం మేరకు బ్రహ్మచర్య వ్రతం అవలంబించారు. అమృత్‌కౌర్‌ గాంధీజీని గురువుగా భావించేవారు. సరళాదేవి బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుభాషా కోవిదురాలు. దేశంలో తొలి మహిళా సంఘం ‘భారత్‌ స్త్రీ మండల్‌’వ్యవస్థాపకురాలు. రవీంద్రనాథ్‌ టాగూర్‌ మేనకోడలు.ఇక, మీరా బెన్‌.. సృజనాత్మకత, భావుకతతో తపించిపోయే కళాత్మక హృదయం కలిగిన అద్భుత మహిళ.ఆమె పేరు మేడ్లీన్‌ స్లేyŠ.. గాంధి ఆమెకు ‘మీరా బెన్‌’ (సోదరి మీరా) అని పేరు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో ఆమె సంఘ సేవకురాలిగా జీవితం గడిపారు.సుశీలా నయ్యర్‌ గాంధీ వ్యక్తిగత వైద్యురాలు. ఆ యన ఆంతరంగి కుల్లో ఒకరు. మనుబెన్‌.. అసలు పేరు మృదులా గాంధీ. గాంధీజీ సోదరుడి మనుమరాలు. 1948లో ఢిల్లీలో గాంధీజీని హత్య చేయడానికి నాథూరామ్‌ గాడ్సే రివాల్వర్‌ ఎత్తి, ఆ బుల్లెట్‌ తగలకుండా పక్కనే ఉన్న ఒక యువతిని పక్కకు నెట్టేశాడు. అలా నెట్టబడిన యువతి మను బెన్‌.సుశీలా నయ్యర్‌

మరిన్ని వార్తలు